Pawan Kalyan ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!

- Advertisement -

పవర్ స్టార్ Pawan Kalyan అంటే యూత్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అయన వేసుకొనే చెప్పులు నుంచి వేసుకొనే డ్రెస్సు వరకు అన్ని తెలుసుకోవాలని తెగ ఆసక్తి చూపిస్తారు.. ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్ ఎంత ధర ఉంటుందా అని ఫ్యాన్స్ లో క్యూరియాసిటి నెలకొంది..నిజానికి ఆ వాచ్ ధర లక్షల్లో ఉంటుందని ఇన్సైడ్ టాక్. మొన్న అన్ స్టాపబుల్ షోలో పవన్ వేసుకున్న జాకెట్ ధర ఇప్పటికి వైరల్ అవుతుంది.. ఇప్పుడు వాచ్.. ఆ వాచ్ పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం…

Pawan Kalyan
Pawan Kalyan

తాజాగా పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు వినోదయ సిత్తం రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. సముద్రఖని దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. గత వారమే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్‌ తీసుకుంటోన్న రెమ్యూనరేషన్ గురించి ఎంతగా హాట్ టాపిక్ జరిగిందో అందరికీ తెలిసిందే. రోజుకు రెండున్నర కోట్లు అని, మూడు కోట్లు అని, నాలుగు కోట్లు తీసుకుంటున్నాడనే టాక్ వచ్చింది. సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా టీజర్ రాబోతోండగా.. పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా చూపించారు. దీని కోసం వినోదయ సిత్తం సెట్‌లోకి విరూపాక్ష టీం వచ్చింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ ఫోటోలు బయటకు వచ్చింది.

ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్‌ ధరించిన వాచ్ మీద అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఈ గడియారం ధర మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ వాచ్ ధర దాదాపు ఆరు లక్షలకు దగ్గర్లో ఉంటుందని తెలుస్తోంది. IWC పైలట్స్ టాప్ గన్ 41 ఎంఎం మెన్స్ వాచ్ అని తెలుస్తోంది. దాని ధర ఇండియాలో 5.87లక్షల వరకు ఉంటుందని సమాచారం… ఇది విన్న ఫ్యాన్స్ షాక్ లో ఉండి పోయారు.. ఇక సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. కానీ మధ్యలో వినోదయ సిత్తం అనే రీమేక్‌ను సెట్ చేశాడు త్రివిక్రమ్. ఇక సుజిత్ సినిమా కూడా లైన్‌లోకి వచ్చింది. కానీ హరీష్‌ శంకర్ సినిమా సంగతిని మాత్రం పవన్ కళ్యాణ్‌ తేల్చడం లేదు. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయనే విషయంలో స్పష్టత లేదు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here