బిజినెస్​లో టాలీవుడ్ హీరోల భార్యల హవా.. వీళ్ల నెల సంపాదన ఎంతో తెలిస్తే షాకే..!

- Advertisement -

టాలీవుడ్​లో స్టార్ హీరోస్ అనగానే గుర్తొచ్చే పేర్లు..రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు.. వీళ్లంతా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ రోజురోజుకూ తమ కలెక్షన్స్ పెంచుకుంటున్నారు. వంద కోట్ల క్లబ్ దాటి వేయికోట్ల వసూళ్ల వైపు అడుగులేస్తున్నారు. అయితే ఓవైపు ఈ స్టార్ హీరోలు బాక్సాఫీస్​ను షేక్ చేస్తుంటే.. మరోవైపు వీళ్ల సతీమణులు బిజినెస్ రంగంలో దూసుకెళ్తున్నారు. బిజినెస్​లో సక్సెస్​ఫుల్​గా రాణిస్తూ కోట్ల టర్నోవర్​ సాధిస్తున్నారు. అలా టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎవరి భార్యలు నెలకు ఎంతెంత సంపాదిస్తున్నారో ఓసారి తెలుసుకుందామా..? ఇంకెందుకు ఆలస్యం.. రండి మరి.. చూసేద్దాం.

నమ్రత శిరోద్కర్ – మహేష్ బాబు :

namratha mahesh babu

టాలీవుడ్ పవర్ కపుల్ అనగానే గుర్తొచ్చేది మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్. ఈ జంట టాలీవుడ్​కు కన్నులపంట. నమ్రత ఒకప్పుడు హీరోయిన్​గా రాణించినా.. పెళ్లి తర్వాత ఫ్యామిలీ బాధ్యతలకు పరిమితమైపోయింది. ఇక ఇప్పుడు మహేశ్ బాబు ప్రొడక్షన్ హౌస్ బిజినెస్ చూసుకుంటూ.. మరోవైపు మహేశ్ బ్రాండ్ హంబుల్ అనే టెస్క్ట్ టైల్ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టారు నమ్రత. ఓవైపు ఇవన్నీ చుసుకుంటూనే మరోవైపు ఏఎంబీ మల్టీప్లెక్స్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ఇంకోవైపు సామాజిక సేవలోనూ ఈమె ముందుంటారన్న విషయం తెలిసిందే.

- Advertisement -

లక్ష్మీ ప్రణతి – జూనియర్ ఎన్టీఆర్ :

ntr pranathi

ఇంటర్నేషనల్ స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ఎక్కువ లైమ్​ లైట్​లో కనిపించరు. లక్ష్మీ ప్రణతి గురించి చాలా మందికి ఎక్కువగా తెలియదు కూడా. కానీ ప్రణతి త్వరలోనే ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్​ను స్టార్ట్ చేయబోతున్నారట. ఇంకెందుకు ఆలస్యం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా.. ఆల్ ది బెస్ట్ ప్రణతి.

ఉపాసన – రామ్ చరణ్ :

టాలీవుడ్ కపుల్ రామ్ చరణ్-ఉపాసన కూడా పవర్​ కపుల్​గా పేరు గాంచిన వారే. ఇక ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అపోలో హాస్పిటల్ డైరెక్టర్​గా బాధ్యతలు నిర్వహిస్తూ.. మరోవైపు యువర్ లైఫ్ అనే హెల్త్ ఛానెల్ నడుపుతూ.. ఇంకోవైపు ఎయిర్లైన్స్ బిజినెస్ చూసుకుంటూ.. ఇంకా సామాజిక సేవలోనూ ఉపాసన ముందుంటారు. నేటి మోడర్న్ మహిళకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉపాసన అని చెప్పొచ్చు.

స్నేహ రెడ్డి – అల్లు అర్జున్ :

allu sneha reddy
allu sneha reddy

టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డి. స్నేహా రెడ్డిని చూస్తే హీరోయిన్​ను చూసినట్టే అనిపిస్తుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్.. యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటాయి. అయితే స్నేహా రెడ్డి సొంతంగా ఓ ఫొటో స్టూడియో నడిపిస్తున్నారు. అంతే కాకుండా. ఆమె తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు.

అంజనా దేవి – నాని :

nani anjana

నేచురల్ స్టార్ నాని భార్య అంజనా గురించి బయట ప్రపంచానికి చాలు తక్కువగా తెలుసు. అంజనా దేవి ఆర్కే మీడియాలో క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేస్తున్నారు. ఈమె బాహుబలి సినిమాకు కూడా వర్క్ చేశారట.

విరూపా కంటమనేని – అల్లరి నరేష్ :

allari naresh wife

స్టార్ హీరో అల్లరి నరేష్ భార్య కూడా బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. విరూప ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను రన్ చేస్తూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు. ఈ రంగంలో చాలా అవార్డులను కూడా అందుకున్నారు.

చూశారుగా.. అలా భర్తలు టాలీవుడ్​ను ఏలేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే.. వారి భార్యలు బిజినెస్ రంగంలో దూసుకెళ్తూ కోట్ల టర్నోవర్లు సాధిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here