Anjali : ఏమో.. నాకన్నీ అలా తెలిసిపోతాయంతే.. ఈ డైలాగ్ వినగానే మీకు గుర్తొచ్చే పేరేంటి సీత కదూ. అదేనండి అంజలి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తన అమాయకత్వంతో మది దోచేసింది. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలే చేసింది. మరోవైపు తమిళంలోనూ తన సత్తా చాటుతోంది. ఇక ఛాన్స్ వస్తే స్పెషల్ సాంగ్స్ లో నూ నటిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.

ఈ భామ తెలుగులో గీతాంజలి అనే హార్రర్ అనే సినిమాలో నటించిన విషం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే చిత్రం వచ్చింది. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది కూడా. ఈ మూవీ ప్రమోషన్స్ లోనే అంజలి బిజీగా ఉంది. ఇక ఈ ప్రమోషన్స్ లో తాజాగా రెడ్ కలర్ శారీలో సందడి చేసింది.
రెడ్ శారీలో తన లేటెస్ట్ ఫొటోలను అంజలి నెట్టింట్లో షేర్ చేసింది. అంతే క్షణంలో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక లైకులు, షేర్లకు లెక్కే లేదు. రెడ్ శారీలో ఈ బ్యూటీ తన మెస్మరైజ్ స్మైల్ తో కుర్రాళ్ల మది దోచేసింది. కాటుక కళ్లతో కైపెక్కించింది. నాజూకు నడుం చూపిస్తూ నెట్టింట రచ్చ పుట్టించింది.
అంజలి లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు గుండె జారి గల్లంతయిపోయింది. రెడ్ శారీలో ఘాటు మిర్చిలా ఉన్నావ్ బ్యూటీ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో హాట్ సమ్మర్ లో ఈ భామ తన అందంతో మరింత హీట్ పుట్టిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అంజలి తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట దుమారం రేపుతోంది.