Manju Manoj : హాస్పిటల్ నుంచి కూతురితో కలిసి ఇంటికి మనోజ్ దంపతులు.. వెల్ కమ్ అదిరిందిగా

- Advertisement -

Manju Manoj : టాలీవుడ్ యంగ్ నటుడు మంచు మనోజ్ తండ్రి అయిన విషయం తెలిసిందే. మనోజ్ – మౌనిక జంట తాజాగా ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఓవైపు మనోజ్, మరోవైపు మనోజ్ సోదరి, నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక తాజాగా ఈ జంట తమ కుమార్తెను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు.

Manju Manoj
Manju Manoj

మనోజ్ మౌనిక హాస్పిటల్ నుంచి తమ పాపాయిని తీసుకుని ఇంటి వద్ద పెద్ద హడావుడి జరిగింది. ఆ క్యూట్ బేబీకి మంచు ఫ్యామిలీ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పింది. మౌనిక పాపని ఎత్తుకొని రాగా మనోజ్ తన చిన్నారికి ఎండ పడకూడదని చేతులు అడ్డు పెట్టడం ఫొటోల్లో కనిపించింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు భలే ఖుష్ అవుతున్నారు. మనోజ్ చాలా కేరింగ్ ఫాదర్ అంటూ కితాబిస్తున్నారు.

- Advertisement -

ఇక కుమార్తెతో వచ్చిన ఈ తల్లిదండ్రులకు హారతితో ఇంట్లోకి ఆహ్వానించారు కుటుంబ సభ్యులు. ఇక ఈ క్యూటీ పై ఇంటికి వస్తుందని తెలిసి ఇల్లును చాలా అందంగా డెకరేట్ చేశారు. పాప కోసం ఒక రూమ్ ను స్పెషల్ గా అలంకరించినట్లు సమాచారం.  ఈ చిన్నారికి ఎంఎంపులి ( MM Puli ) అని నిక్ నేమ్ పెట్టినట్లు ఈ జంట చెప్పిన విషయం తెలిసిందే.

mounika reddy manchu manoj

మంచు మనోజ్, భూమా మౌనికను గతేడాది వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ రెండో పెళ్లి కావడం గమనార్హం. అంతకుముందు మౌనికకు ఒక కుమారుడు ధైర్య కూడా ఉన్నాడు. ఆ బాలుడిని మనోజ్ తన సొంత కుమారుడిలా చూసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కొన్ని నెలల క్రితం మౌనిక ప్రెగ్నెంట్ అనే విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి అందరి ఆశీస్సులు కోరారు. తాజాగా ఈ జంటకు అందమైన పాపాయి పుట్టిందని ఈ జంట అభిమానులతో తమ ఆనందాన్ని షేర్ చేసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here