బయ్యర్స్ కి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాత సినిమాలు బంగారు గుడ్లు పెట్టే బాతులు లాగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రీ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి. ఇప్పటి వరకు మన స్టార్ హీరోల ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ, ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం ‘ఖుషి’ రీ రిలీజ్ గ్రాస్ కలెక్షన్స్ కి దరిదాపుల్లో కూడా రాలేకపోయాయి.
ఇక ఈ ఏడాది ఈ రికార్డు ని ఎలా అయినా కొట్టాలి అనే కసితో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెల రోజుల ముందు నుండే ప్రొమోషన్స్ చేస్తూ, భారీ ప్లానింగ్ రిలీజ్ చేసారు. కానీ దగ్గర్లోకి కూడా రాలేకపోయింది. ఖుషి చిత్రానికి ఫుల్ రన్ లో 7 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, సింహాద్రి చిత్రానికి కేవలం నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
అంతకు ముందు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు వేసిన ‘జల్సా’ సినిమా స్పెషల్ షోస్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి అప్పట్లో మూడు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం ఒక్క రోజు మాత్రమే ప్రదర్శించారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబడుతుండడం తో బయ్యర్స్ కి పవన్ కళ్యాణ్ పాత సినిమాలను 4K కి మార్చి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అలా వచ్చిన ఆలోచనతోనే రీసెంట్ గా ‘తొలిప్రేమ’ చిత్రాన్ని 4K కి మార్చి నిన్న గ్రాండ్ గా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ ప్రోత్సహించకూడదు అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున క్యాంపైన్ చేసారు.
ఎందుకంటే మంచి ఉద్దేశ్యం కోసం ఇలాంటి షోస్ ని వేసుకుంటూ ఉంటాము, కొంతమంది అతి ఉత్సాహం కి పోయి, దీనిని క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ ఈ రేంజ్ లో బాయ్ కట్ చేసిన తర్వాత ఈ సినిమాని ఎవరు చూస్తారులే అని అనుకున్నారు. కానీ అనూహ్యమైన రీర్తిలో ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్ దక్కింది. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మోత మోగించేసింది. అలా ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు. అంతే కాదు హైదరాబాద్ లాంటి సిటీస్ లో రెండవ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి, ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.