‘బ్రో’ సినిమాలో పూజా హెగ్డే.. త్రివిక్రమ్‎ని ఆడుకుంటున్న నెటిజన్లు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించి సినిమా ‘బ్రో’ టీజర్ వచ్చేసింది. పవన్ వింటేజ్ లుక్స్, తేజ్ కామెడీ టైమింగ్, తమన్ మ్యూజిక్, సముద్రఖని షాట్స్, త్రివిక్రమ్ డైలాగులు.. ఇలా అన్నీ టీజర్లో సూపర్ గా సెట్ అయ్యాయి. అయితే ఈ సినిమా టీజర్ లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కనిపించింది. అదేంటి ఆమె ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా.. ప్రస్తుతం పూజా హెగ్డేకు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు లేవు. కానీ బ్రో చిత్రంలో మెరిసింది. బ్రో సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ లీడ్ రోల్ చేస్తుండగా.. పూజా హెగ్డే ఎక్కడా అనుకుంటున్నారా.. ? ఆమె చేసింది అతిథి పాత్ర, లేదా ఐటం సాంగా అని మెదడుకు పదును పెట్టారా…..కాస్త ఆగండి. బ్రో టీజర్ ప్రారంభంలోనే… పూజా హెగ్డే ఎంట్రీ ఇచ్చింది. బ్రో టీజర్ ప్రారంభంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ కనిపిస్తుంది. ఆ పోస్టర్ లో పూజా హెగ్డే చీరకట్టుతో కనిపించింది. దీన్ని చూసిన చాలా మంది నెటిజన్స్.. బ్రో సినిమాలో పూజ అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడీయాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది.

పూజా హెగ్డే
పూజా హెగ్డే

ఈ సినిమాలో పెట్టడానికే పూజ హెగ్డేను మహేష్ సినిమా గుంటూర కారం నుంచి తప్పించారా? అంటూ ఫన్నీ గా క్వశ్చన్ చేస్తున్నారు. బ్రో సినిమాకు మాటలు అందించింది త్రివిక్రమ్ అన్న సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమా బ్రాండ్ స్టాంప్ ఎలా ఉంటుందో.. అలాగే త్రివిక్రమ్ సినిమాల్లో పూజ కనిపిస్తుందని అంటున్నారు. నాగచైతన్య సరసన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పూజా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమా తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. అయితే కొంత కాలంగా ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి వరుస ఫ్లాప్ లు వచ్చాయి. అయినప్పటికీ మహేష్ గుంటూరు కారంలో ఛాన్స్ దక్కించుకుంది అనుకునే లోపే.. ఆ సినిమా నుంచి పూజా ఔట్ అంటూ వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే బ్రో సినిమాకు నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినొదయ సిత్తం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వస్తోంది.

bro movie teasr
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here