Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ మొట్టమొదటి రివ్యూ..బీపీ పేషెంట్స్ ఈ సినిమాని చూడకపోడం బెటర్ అట!

- Advertisement -

Tiger Nageswara Rao : మాస్ మహారాజ రవితేజ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. నిజ జీవితం లో టైగర్ నాగేశ్వర రావు అనే బందిపోటు దొంగ జీవిత కథని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు నూతన దర్శకుడు వంశీ. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ అభిమానులను మరియు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

అసలు మేము చూడబోతుంది రవితేజ సినిమానేనా అని ఆశ్చర్యపోయేలా చేసింది ప్రమోషనల్ కంటెంట్. అక్టోబర్ 20 వ తేదీన ఈ చిత్రానికి వచ్చే ఓపెనింగ్స్ రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉండబోతుందని ట్రేడ్ పండితులు బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫైనల్ కాపీ కి సంబంధించిన ప్రివ్యూ షో ని కొంతమంది పాత్రికేయులు మరియు మీడియా మిత్రుల సమక్ష్యం లో నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో వేశారు.

ఈ ప్రివ్యూ షో కి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ దక్కింది. రవితేజ కెరీర్ లో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదని, కొన్ని యాక్షన్ సన్నివేశాలకు గూస్ బంప్స్ వచ్చిందని, సీట్ లో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా ఆ సన్నివేశాలు చూసినప్పుడు గుండె ప్యాంట్ లోకి జారిపోయింది అంటూ మేకర్స్ కి శుభాకాంక్షలు తెలియచేసారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, రవితేజ నటన మరియు ఎమోషన్ సన్నివేశాలు ఇవన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయని, ఈ ఏడాది లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఈ సినిమా కచ్చితంగా నిలుస్తుందని అంటున్నారు.

- Advertisement -

అంతా బాగానే ఉంది కానీ, ఈ చిత్రానికి పాటలు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ లాగ నిలుస్తాయట. అవొక్కటి బ్యాలన్స్ చేసి ఉంటే ఈ సినిమా రేంజ్ ఎక్కడో ఉండేది అని చెప్పారట ఈ ప్రివ్యూ షో లో చూసినవారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే 20 వ తేదీ వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here