Bigg Boss : ఈ వారం కూడా బిగ్ బాస్ లో టేస్టీ తేజా సేఫ్.. ఓటింగ్ లైన్ మొత్తం తారుమారు.. డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు!

- Advertisement -

Bigg Boss : ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎంత రసవత్తరంగా సాగుతుందో మన అందరం చూస్తూనే ఉన్నాం. ఆసక్తికరమైన టాస్కులతో , కంటెస్టెంట్స్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఈ రియాలిటీ షో ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. ఈమధ్యనే ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ అప్పుడే 4 వారాలు పూర్తి చేసుకొని , 5 వారం లోకి అడుగుపెట్టింది.

Bigg Boss
Bigg Boss

ఈ 5 వ వారం లో పవర్ అస్త్ర టాస్కుని పూర్తిగా రద్దు చేసి, కెప్టెన్సీ టాస్కుని ప్రవేశ పెట్టారు. ఈ వారం కెప్టెన్ ఎవరు అవ్వబోతున్నారు అనేది రేపు తెలియనుంది. ఇక పోతే గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి రతికా ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక వారం నామినేషన్స్ లోకి శివాజీ , ప్రియాంక, అమర్ దీప్, తేజా, శుభ శ్రీ, గౌతమ్ మరియు యావర్ వచ్చారు.

మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చెప్పడం చాలా కష్టం అవుతుంది. ముందుగా శివాజీ 40 శాతం కి పైగా వోల్టాని సాధించి టాప్ 1 స్థానం లో ఉన్నాడు. ఆయన తర్వాతి స్థానం లో యావర్ మరియు అమర్ దీప్ ఉన్నారు. కానీ శుభ శ్రీ, తేజా, ప్రియాంక మరియు గౌతమ్ కి సమానమైన ఓట్లు లభించాయి. ఇంత సమానంగా ఓట్లు రావడం బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి.

- Advertisement -

అయితే వీరిలో తేజా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రియాంక లేదా శుభ శ్రీ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారట. గత వారం తేజా చేసిన పనులకు, ప్రేక్షకులు ఈ వారం అతన్ని ఇంటికి పంపిస్తారని అనుకున్నారు. కానీ మరోసారి ఆయన సేవ్ అయ్యాడని, ఈ వారం కూడా ఎలిమినేషన్ షాకింగ్ ట్విస్ట్ ఇచేలా ఉంటుందని తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here