Polimera : ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ‘పొలిమేర 2 ‘ చిత్రానికి ఏ స్థాయి వసూళ్లు వస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. 2021 వ సంవత్సరం లో డిసెంబర్ నెలలో డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చేతబడుల నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో ఊహించని ట్విస్టులతో , ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో అశేష ప్రేక్షకాభిమానం పొందింది. పార్ట్ 2 కోసం ఆడియన్స్ ని ఎదురు చూసేలా చేసింది.

అలా భారీ అంచనాల నడుమ రీసెంట్ గా విడుదలైన ‘పొలిమేర 2 ‘ చిత్రం కూడా అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో సత్యం రాజేష్ కి భార్య గా కామాక్షి భాస్కర్ల అనే అమ్మాయి నటించింది. ఎంతో సహజాతత్వానికి దగ్గరగా ఉన్న నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కామాక్షి మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అచ్చ తెలుగు అంమ్మాయి.

కామాక్షి డాక్టర్ చదువు చదివి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేసింది. మోడలింగ్ రంగం మీద ఆసక్తి ఉన్న కామాక్షి 2018 వ సంవత్సరం లో మిస్ తెలంగాణ గా నిల్చింది. ఆ తర్వాత ప్రియురాలు అనే తెలుగు సినిమాతో వెండితెరకి పరిచయమైనా ఈ తెలంగాణ పిల్ల ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, విరూపాక్ష, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం, పొలిమేర సిరీస్ లో నటించింది.

అయితే ఆమెకి బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు మాత్రం పొలిమేర సిరీస్ అనే చెప్పొచ్చు. ఇక విరూపాక్ష చిత్రం లో హీరోయిన్ సంయుక్త మీనన్ తల్లిగా సినిమా ప్రారంభం లో కనిపించేది ఈమెనే. సినిమాల్లో పెద్దగా గ్లామర్ షో చెయ్యకుండా చాలా సింపుల్ గా కనిపించే కామాక్షి సోషల్ మీడియా లో మాత్రం హాట్ అందాలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని మీకోసం అందిస్తున్నాము చూడండి.


