Varun Tej – Lavanya : సమంత – చైతు బాటలోనే వరుణ్ – లావణ్య.. వాళ్లను చూసైనా బుద్ధి తెచ్చుకోండి అంటున్న నెటిజన్లు

- Advertisement -


Varun Tej – Lavanya : సమంత నాగ చైతన్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగినా చెప్ప్తుంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చైతన్య సమంతల పేర్లు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోయాయో చూస్తూనే ఉన్నాం.

Varun Tej - Lavanya
Varun Tej – Lavanya

మళ్ల ఇప్పుడు అదే రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పేర్లు. కారణం ఏంటో తెలియదు కానీ నాగ చైతన్య – సమంతకు మించిన రేంజ్ లో.. ఇంకా చెప్పాలంటే కూసింత ఎక్కువగానే వీళ్ల పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. కాగా రీసెంట్ గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసిన సంగతి తెలిసిందే.

samantha naga chaitanya
samantha naga chaitanya

ఈ క్రమంలోనే వీళ్లకి సంబంధించిన పెళ్లి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కాగా ఒకప్పుడు డైరెక్టర్ లు చైతన్య సమంతలతో ఎక్కువగా సినిమాలు చేయాలని వాళ్ల ఇంటి చుట్టూ తిరుగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు వరుణ్-లావణ్యల పెళ్లై వారం రోజులు కాకముందే పెద్ద పెద్ద డైరెక్టర్లు వరుణ్ లావణ్యలను భార్యభర్తలుగా తెరపై చూపించడానికి పలు రకాల స్క్రిప్స్ ను వాళ్లకు వినిపించడానికి రెడీ అయ్యారట.

- Advertisement -

అయితే ఈ జంట మాత్రం అప్పుడిప్పుడే సినిమాలు చేసే ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చేస్తుందట. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే లావణ్య పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుందట. అది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలే చేయడానికి ఒప్పుకుంటుందట. మళ్లీ పెళ్లి తర్వాత యాక్టింగ్ అంటే మీ మధ్యలో మనస్పర్థలు వస్తాయి.. గతంలో సమంత నాగ చైతన్య విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here