Game Changer కి ఇంతమంది డైరెక్టర్స్ పనిచేశారా..సినిమాని శంకర్ గాలికి వదిలేసాడుగా!

- Advertisement -

Game Changer #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం షూటింగ్ జరిగి ఉంటే, ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కి విడుదల అయ్యి ఉండేది. కానీ మధ్యలో శంకర్ ఇండియన్ 2 ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం రావడం తో, ఎక్కువగా ఆ సినిమా మీదనే ఫోకస్ చేస్తూ, ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ప్రాధాన్యత తగ్గించాడు.

Game changer
Game changer

నెల రోజుల్లో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ కి పని చేస్తే, మరో 15 రోజులు ‘ఇండియన్ 2 ‘ కి చేస్తున్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, గత ఏడాది మొత్తం మీద శంకర్ ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం కేవలం 20 రోజులు మాత్రమే పనిచేసాడట.

Ram charam game changer
Ram Charan Game changer

నిర్మాత దిల్ రాజు కి అనుకున్న బడ్జెట్ కంటే, ఖర్చు అవుతున్న బడ్జెట్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఆయనలో అసహనం ఏర్పడడం తో, శంకర్ ని నమ్ముకోకుండా, పలువురు యంగ్ డైరెక్టర్స్ తో ఆయన ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయించాడట. ఆ యంగ్ డైరెక్టర్స్ లో శైలేష్ కొలను కూడా ఉంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలు అయ్యింది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఈ షెడ్యూల్ లో అసలు శంకర్ రాలేదట. అందుబాటులో ఉన్న ఒక యంగ్ డైరెక్టర్ ఈ షెడ్యూల్ లో సాన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కేవలం 70 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి అయ్యింది. మిగిలిన 30 శాతం షూటింగ్ పూర్తి చెయ్యడానికి, శంకర్ రెండు నెలల డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దిల్ రాజు ప్రస్తుతం ఆయన డేట్స్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడట. పాపం ఆయనకీ శంకర్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here