Kushi Movie : ఖుషి తో సహా పాత సినిమా టైటిల్స్ తో వచ్చిన మూవీస్ ఇవే…

- Advertisement -

Kushi Movie : మూవీకి కథ కథనం ఎంత ముఖ్యమో..టైటిల్ అంతకంటే ముఖ్యం. క్రిస్పీ టైటిల్ ఉంటేనే ఆ చిత్రం సులభంగా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళగలుగుతుంది. అందుకే సినిమాకు తగ్గ టైటిల్ పెట్టడం టాలీవుడ్ లో పరిపాటి. మరి చాలా సందర్భాలలో కొన్ని చిత్రాలకు ఇంతకుముందు వచ్చిన మూవీస్ టైటిల్స్ పెట్టడం జరిగింది. రీసెంట్‌గా విడుదలకు సిద్ధంగా ఉన్న విజయ్ దేవరకొండ మరియు సమంత కాంబినేషన్ లో వస్తున్న ఖుషి చిత్రం దగ్గర నుంచి చాలా సినిమాలకు పాత టైటిల్స్ పెట్టడం జరిగింది. మరి అవి ఏమిటో ఈ రోజు చూద్దాం…

Kushi Movie
Kushi Movie

ఖుషి

పవన్ కళ్యాణ్ రేంజ్ పెంచి హీరోగా అతనికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ వేసిన ఏర్పాటు చేసిన చిత్రం ఖుషి. ఇప్పుడు ఇదే టైటిల్ తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా రాబోతుంది. నిజానికి మూవీ కంటే కూడా ఈ టైటిల్ విడుదలకు ముందే ఈ చిత్రానికి క్రేజ్ ని పెంచింది అని చెప్పవచ్చు.

- Advertisement -
Toli Prema

తొలి ప్రేమ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో సాలిడ్ హిట్ గా నిలిచిన చిత్రం తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ కు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన అప్పటి తొలిప్రేమ చిత్రం టైటిల్ ని ఈ మూవీకి పెట్టడం జరిగింది.

Major

మేజర్

అడివి శేష్ హీరోగా రీసెంట్గా విడుదలై భారీ హిట్ సాధించిన చిత్రం మేజర్. ఈ చిత్రం కు ఒకప్పుడు చిరంజీవి నటించిన మేజర్ మూవీ టైటిల్ పెట్టడం జరిగింది. అయితే అప్పట్లో ఆ చిత్రం ఊహించిన ఫలితాలను అందుకోవడంలో విఫలమయింది.

vikram

విక్రమ్

కమల్ హాసన్ కు హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి బూస్ట్ ఇచ్చిన చిత్రం విక్రమ్. గతంలో కమల్ హాసన్ ఏజెంట్ విక్రమ్ 007 టైటిల్ తో కూడా ఒక చిత్రాన్ని చేయడం జరిగింది. ఈ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చూపించడం జరిగింది. ఇదే విక్రమ్ టైటిల్ తో నాగార్జున తన మొదటి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here