OTT Release This Week లో సందడి చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే..!!

- Advertisement -

OTT Release This Week : గత మూడేళ్లుగా ఓటిటి లు బాగా ఫెమస్ అయినా విషయం తెలిసిందే..థియేటర్లలో గంటల తరబడి వేచి ఉండటం కన్నా తక్కువ బడ్జెట్ తో ఎక్కువ సినిమాలు చూసే విధంగా ఓటిటి ప్రత్యేకమైన సదుపాయాలను అందిస్తుంది.. ప్రతి వారంలాగే ఈ వారం కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటిటిలో విడుదల కానున్నాయి..ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏంటో ఒక లుక్ వేద్దాం పదండీ..

OTT Release This Week
OTT Release This Week

తమిళ్ హీరో దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘వారసుడు’. ఈ మూవీ అటు తమిళం.. ఇటు తెలుగులో బ్లాక్‌బస్టర్ అందుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ బాణీలు అందించాడు. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీల్లో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఫిబ్రవరి 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది..

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ ఫిబ్రవరి 23 నుంచి తెలుగు, మలయాళం, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది..

- Advertisement -
OTT Release This Week

అదే విధంగా..సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘మైకేల్’. ఇందులో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ కాగా, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో ఈ మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ‘ఆహా’ వేదికగా ఈ నెల 24 నుంచి ఈ తెలుగుతో పాటు తమిళంలోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.. వీటితో పాటు మమ్ముట్టి నటించిన ‘నన్పక నేర్తు మయక్కం’ ఫిబ్రవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో.. కన్నడ హీరో దర్శన్ నటించిన ‘క్రాంతి’ ఫిబ్రవరి 23 నుంచి కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. ఫిబ్రవరి 24న ఇరుధృవమ్-2 తమిళంలో సోనీ లివ్ ఓటీటీ వేదికగా.. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here