బాహుబలితో ఒక్కాసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. అయితే బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ వరుస ప్లాపులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఇండియాలో ఏ హీరో క్రియేట్ చేయని చెత్త రికార్డ్ ప్రభాస్ నమోదు చేశాడు. ప్రభాస్ గత మూడు సినిమాలు అక్షరాలా రూ. 276 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టాయి.
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి సాహో సినిమా వచ్చింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 290 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే తొలి రోజు మొదటి ఆట నుంచి సాహో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ దృష్ట్యా సాహో రూ. 230 కోట్ల రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టింది. అయినా ఈ సినిమాకు రూ. 60 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్
తో కంప్లీట్ లవ్ స్టోరీతో అలరించాడు.

ఈ సినిమా ఫలితం తెలిసిందే. రూ. 210 కోట్ల టార్గెట్ తో వస్తే.. ఫుల్ రన్ లో కేవలం రూ. 84 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఫలితంగా రూ. 126 కోట్ల నష్టం. ఇక తాజాగా ప్రభాస్ నుంచి ఆదిపురుష్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రూ. 240 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చింది ఆదిపురుష్.. ఇప్పటి వరకు రూ. 150 కోట్లు రాబట్టింది.

అలాగే మరో రూ. 90 కోట్లు వచ్చినా ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయి ఆదాయాన్ని అందుకోవడం అసాధ్యమనే అనిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ గత మూడు సినిమాలు రూ. 276 కోట్ల నష్టం వాటిల్లింది. ఇదొక రికార్డు. గత మూడు సినిమాల నష్టాలు కలిపినా టాలీవుడ్ లో మరే హీరో ఈ రేంజ్ ఫిగర్స్ అందుకోలేడు.