Kiara Advani : తన భర్తతో తిరుగుతున్న రాశీఖన్నా.. చూసి తట్టుకోలేక విడాకులకు సిద్ధమైన కియారా

- Advertisement -


Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హిందీ, తెలుగు రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే తను ఎంతగానో ప్రేమించిన సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ మరింత బిజీ అయిందనే చెప్పాలి. వరుస సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ అభిమానులను పలకరిస్తోంది. ఆమె తన వ్యక్తిగత విషయాలను తాజా ఫోటోలు, సినిమా విషయాలను వారితో పంచుకుంటుంది. కియారా అద్వానీ తెలుగులో మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Kiara Advani
Kiara Advani

బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ బిల్డప్ చేసుకుంది. హీరో సిద్ధార్థ్ మాల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ జంట నిత్యం ఫొటో షూట్స్ చేస్తూ అభిమానులను మెప్పిస్తూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే కియారా తల్లి కాబోతుందన్న వార్త వైరల్ అయింది. కానీ ఇందులో నిజం కాలేదు. ఇటీవల తన భర్తతో దిగిన ఫోటోలలో పొట్ట కాస్త ఎక్కువగా ఉండటంతో ఆమె ప్రగ్నెంట్ అని తెగ ట్రెండ్ చేశారు. మళ్లీ తాజాగా కియారా విడాకులకు సిద్ధమైందన్న వార్త హల్ చల్ చేస్తోంది. భర్త మరో హీరోయిన్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని ఓ ఈవెంట్‌లో కనిపించడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందట.

Kiara Advani

అసలు విషయంలోకి వెళితే.. సిద్ధార్థ్, రాశి ఖన్నా కాంబోలో రాబోతున్న త్వరలో యోధ అనే చిత్రం రాబోతుంది. ఇందులో హాట్ బ్యూటీ దిశా పటాని ఓ కీలక పాత్రలో నటిస్తుంది. యోధ మార్చి 15న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ఈ క్రమంలో రాశి ఖన్నా, సిద్దార్థ్ కలిసి రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వీరిద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు.

- Advertisement -

దీంతో అది చూసిన కియారా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు పెళ్లైన జంటగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటూ? ఫ్యా్న్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కియారాకు అన్యాయం చేయకండి.. ఆమెతోనే మీరు ఇలా తిరగండి అంటూ సిద్ధార్థను వేడుకుంటున్నారు. ఇంకా కొందరు నెటిజన్లు మాత్రం కియారా డైవర్స్ పేపర్స్ రెడీ చేసుకుంటుందంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here