Ravi Teja : మాస్‌మహారాజ ట్రిపుల్ ధమాకా.. రవితేజ్ ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ మూడు గుడ్‌న్యూస్‌లు

- Advertisement -

Ravi Teja : మాస్ మహారాజా రవితే.. ఈ పేరులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఔట్ సైడర్‌గా అడుగుపెట్టాడు రవితేజ. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా హీరాగ ఎదిగాడు. సాధారణ హీరో కాకుండా మాస్‌కే ఊరమాస్ అనిపించే మాస్ మహారాజ బిరుదును పొందాడు. స్వయం కృషితో ఎదిగిన ఈ హీరో కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు.. మరెన్నో ఆటుపోట్లు. వాటన్నింటిని అవలీలగా దాటుకుంటూ గెలుపోటములు సమానంగా చూస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.

Ravi Teja
Ravi Teja

ప్రస్తుతం రవితేజ ఈగల్ మూవీ సక్సెస్‌ జోషలో ఉన్నాడు. గతేడాది వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరోకు ఆ తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు అంతగా కలిసి రాలేదు. వరుస ప్లాఫ్‌లు ఎదురైనా రవితేజకు అవకాశాలకు కొదువ లేదు. ఇక తాజాగా ఈగల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈగల్ హిట్ కావడంతో మాస్ రాజా ఫ్యాన్స్ కూడా తెగ ఖుష్ అయిపోతున్నారు. ఇక రవితేజ ఈ సినిమా తర్వాత హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

ఇక తాజాగా రవితేజకు సంబంధించిన మూడు క్రేజీ వార్తలు అభిమానులను సంతోషంలో ముంచేశాయి. ఓవైపు ఈగల్ సినిమా హిట్ కావడంతో సం బురాల్లో మునిగిపోయిన మాస్ మహారాజ ఫ్యాన్స్‌కు ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు. రవితేజ కెరీర్​లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన కిక్ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మార్చి 1వ తేదీన ఈ సినిమాను గ్రాండ్​గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కిక్ రీ రిలీజ్ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

- Advertisement -

మరోవైపు రవితేజ రీసెంట్ రిలీజ్​ ఈగల్ కూడా ఫ్యాన్స్​కు సూపర్​ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ చిత్రం మార్చి 2వ తేదీ నుంచి ఈటీవీ విన్‌‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ధమాకా సినిమాలోని పల్సర్ బైక్ సాంగ్ వీడియో యూట్యూబ్‌లో రికార్డు సాధించింది. రీసెంట్​గా ఈ పాట 200 మిలియన్ వ్యూస్‌‌ను దాటింది. ఇలా వరుసగా మూడు గుడ్ న్యూస్‌లతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ కిక్కే కిక్కు అంటూ తెగ సంబుర పడిపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here