Balakrishna ని చెప్పుతో కొడుతా అంటూ వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. ఆ తర్వాత ఇండస్ట్రీ నుండే వెళ్లిపోయిందిగా!

- Advertisement -

Balakrishna : ఇండస్ట్రీ లో ముక్కు సూటి తత్త్వం తో మెలిగే అతి కొద్ది మంది వ్యక్తులలో నందమూరి బాలకృష్ణ ఒకడు. ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడే వ్యక్తిత్వం కాదు ఆయనది, ఏదైనా నేరుగా మాట్లాడి తేల్చుకునే రకం. అందుకే బాలయ్య బాబు వ్యక్తిత్వం ని అందరూ ఇష్టపడుతుంటారు. వృత్తి పరంగా బాలయ్య బాబు మీద ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ మార్కు కూడా లేదు.

Balakrishna
Balakrishna

షూటింగ్ స్పాట్ లో ఆయన ఉన్నంతసేపు ఒక చిన్నపిల్లవాడు ఉన్నట్టే ఉంటుంది, అందరితో చాలా సరదాగా ఉంటాడు అని ఇప్పటి వరకు ఆయనతో పని చేసిన వారు చెప్తూ వచ్చారు. అయితే రెండు మూడు సందర్భాల్లో అభిమానుల పై చెయ్యి చేసుకోవడం వల్ల బాలయ్య మీద ఆడియన్స్ లో నెగటివ్ అభిప్రాయం ఏర్పడింది. కానీ ‘అన్ స్టాపబుల్’ షో చూసిన తర్వాత బాలయ్య అంటే ఏంటో అందరికీ ఇంకా క్లారిటీ గా అర్థం అయ్యింది.

ఇదంతా పక్కన పెడితే బాలయ్య తో పని చేసిన రాధికా ఆప్టే అనే హీరోయిన్ ఆయన మీద అప్పట్లో కొన్ని సంచలన ఆరోపణలు పరోక్షంగా చేసింది. ఈమె బాలయ్య హీరో గా నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘లెజెండ్’ చిత్రం లో హీరోయిన్ గా చేసింది. అయితే ఒకానొక సందర్భంగా తెలుగు సినిమాలకు దూరం అవ్వడం గురించి అసలు కారణం చెప్తూ ‘ఆ ఇండస్ట్రీ లో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. ఒక పవర్ ఫుల్ హీరో, అతన్ని చూస్తే అందరూ భయపడతారు, అతను నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. చెప్పు తో కొడుతాను అని వార్నింగ్ ఇచ్చాను. అప్పటి నుండి నేను తెలుగు సినిమాల్లో నటించడం మానేసాను’ అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఈమె తెలుగు లో ‘లెజెండ్’ చిత్రం కాకుండా, రక్త చరిత్ర సిరీస్ లో నటించింది. బాలయ్య తో తప్ప తెలుగు లో మరో పవర్ ఫుల్ హీరో తో నటించలేదు. ఒక పవర్ ఫుల్ హీరో తనతో తప్పుగా ప్రవర్తించాడు అని ఆమె అనింది కాబట్టి, ఆ పవర్ ఫుల్ హీరో బాలయ్యనే కదా?, బాలయ్య సరదాగా మాట్లాడిన మాటలని ఆమె తప్పుగా తీసుకొని ఉండొచ్చు అంటూ అప్పట్లో సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపించాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here