Vidhyabalan : ఇటీవల చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని వివిధ కారణాల చేత విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రేమించినంత కాలం బాగుండి పెళ్లి చేసుకున్న వారు కూడా మనస్పర్థలు రావడంతో విడిపోతూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకోబోతుందంటూ ఓ పోస్ట్ నెట్టింట్లో కలకలం సృష్టిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విద్యాబాలన్ గురించి పరిచయం అక్కర్లేదు.
ఎందుకంటే ఆమె తన సినిమాలతో సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితురాలే. విద్యాబాలన్ నటించిన ఏ సినిమా అయినా సంచలనం అవ్వాల్సిందే. ఇప్పటి వరకు వివాదాస్పద చిత్రాల్లో నటిస్తూ వార్తల్లో నిలిచింది ఈ క్యూటీ. ఏ విషయం పైన అయినా సరే తడబడకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తూ ఉంటుంది. అందుకే కొన్నిసార్లు విద్యాబాలన్ మాటలు వివాదాలకు దారితీస్తుంటాయి.

తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకంగా తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఆమెపై ఓ భారీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు, వార్తలతో సంచలనాలు సృష్టించే ఉమైర్ సంధూ రూమర్ క్రియేట్ చేశాడు. విద్యాబాలన్, ఆమె భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ విడిపోయారు. వేర్వేరుగా కాపురం ఉంటున్నారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వార్త నిజమేనా అనే విషయం భారీ చర్చకు దారి తీసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీంతో అది చూసిన వారంతా నిజంగానే విద్యాబాలన్ విడాకులు తీసుకుంటుందా? అని షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం నీకెప్పుడు వేరే వాళ్ల కొంపలు కూల్చడమే పనా అంటూ ఉమైర్ సంధుని తిట్టిపోస్తున్నారు.
ఇక సినిమాల పరంగా విద్యాబాలన్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకొంటున్నారు. శాకుంతల దేవీ, షేర్నీ, జల్సా, నీయత్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా దో ఔర్ దో ప్యార్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి అంతంత మాత్రంగానే స్పందన ఉంది. ఈ సినిమాలో లిప్ లాక్స్‌తో ఆమె నటించిన తీరు చర్చనీయాంశం అయింది.