Jr NTR ఫ్యాన్స్ ను గూస్ బంప్స్ తెప్పించే న్యూస్.. ఆ హీరోతో మల్టీస్టారర్

- Advertisement -

Jr NTR : ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా మరో హీరోతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో వారి ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో సంబరపడిపోతున్నారు. ఇప్పుడు హీరోలు సింగిల్ గా సినిమాల్లో నటించడం కన్నా.. మిగతా హీరోలతో కలిసి నటిస్తే మార్కెట్ పెంచుకోవచ్చని భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోమారు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Jr NTR
Jr NTR

గతంలో జయప్రదతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలకవ్యాఖ్యలు చేశారు. జయప్రద ..‘మీరు మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తారా..? మీరు ఏ హీరోతో మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించింది. దీనికి తారక్ ఓపెన్ గా ఆన్సర్ ఇస్తూ ..నేను మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి ఎప్పుడూ రెడీ.. నాకు అవకాశం వస్తే నేను మొదటిగా చూస్ చేసుకునే హీరో మహేష్ బాబు ..ఆయనతో మల్టీ స్టార్ సినిమా చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను.. ఇన్ఫాక్ట్ నేను దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఆ ఇంటర్వ్యూను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నందమూరి, ఘట్టమనేని ఫ్యాన్స్. మరెందుకు ఆలస్యం దర్శకులు.. ఆలోచన ఉంటే మంచి కథను రాయండి.. అది అదిరిపోయే రేంజ్ లో ఉండాలి .. బాక్సాఫీస్ చరిత్ర తిరగరాయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. అది బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ అయింది. అవార్డులు రివార్డులతో ఇండస్ట్రీని మోత మోగించింది. ప్రెసెంట్ దేవర, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాల్లో నటిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here