Megha Akash : నెటిజన్లను పిచ్చోళ్లను చేసిన మేఘా ఆకాష్.. అసలు మేటర్ ఇదే

- Advertisement -

Megha Akash: హీరో నితిన్ సరసన ‘లై’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ మేఘ ఆకాష్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటింటి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓ రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. షూటింగ్స్‌లో పాల్గొంటూ కాల్షీట్లు ఖాళీగా లేకుండా చూసుకుంటుంది. ఈ క్రమంలో నిన్నటి నుంచి మేఘ ఆకాష్ కు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. చెన్నైకి చెందిన బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంటోంది అంటూ నెట్టింట్లో వార్త వైర‌ల్ అయ్యింది. దీనికి కార‌ణం ఆమె సోషల్ మీడియాలో ఒక ఫొటో పోస్ట్ చేయ‌డం. చ‌క్కగా చీర క‌ట్టుకుని, చేతికి గోరింటాకు పెట్టుకుని షేర్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్స్ ఆమె మ్యారేజ్ చేసుకుంటుందంటూ భావించారు.

అయితే, ఇప్పుడు ఆమె మ‌రోసారి పెళ్లి ఫొటోలు షేర్ చేశారు. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చింది. అవి ఆమె పెళ్లి కాదు. వెడ్డింగ్ వీక్ డంప్ అంటూ పలు ఫొటోలు పెట్టి.. మై లవ్ శ్వేత కళాధరన్ స్టన్నింగ్ బ్రైడ్ అని క్యాప్షన్ జత చేసింది. దీంతో మేఘ ఆకాష్ కజిన్ పెళ్లి అని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం మేఘ ఆకాష్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో ఈ అమ్మడుని సంప్రదాయ లుక్స్‌లో చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

మేఘ ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రాజశ్రీ నాయర్, ‘శుభలేఖ’ సుధాకర్ త‌దిత‌ర సీనియ‌ర్ న‌టులతో క‌లిసి ‘సఃకుటుంబానాం’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో రామ్ కిర‌ణ్ హీరోగా చేస్తున్నారు. ఉద‌య్ శ‌ర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకంపై మహాదేవ గౌడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సుస్వరాల శర్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక దీంతో పాటు ఆమె న‌టించిన విక‌ట క‌వి అనే వెబ్ సిరీస్ జీ 5లో రానుంది. అయితే, దానికి సంబంధించి రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఇక విక‌ట‌క‌వి తెలంగాణ బేస్డ్ గా వ‌స్తున్న మొద‌టి వెబ్ సిరిస్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here