తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ కొంతమంది కమెడియన్స్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. కేవలం ఆ టైమింగ్ వల్లే వాళ్ళు ఎంతో ప్రత్యేకంగా గుర్తించబడుతారు. సన్నివేశం లో కంటెంట్ ఉన్నా లేకపోయినా, కేవలం వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే మ్యానరిజమ్స్ మరియు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు సునీల్.
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఇండస్ట్రీ లో నెగ్గుకురావాలని భీమవరం నుండి వచ్చిన సునీల్, అతి తక్కువ సమయం లోనే స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా, హీరో గా కూడా సునీల్ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ‘అందాల రాముడు’, ‘పూల రంగడు’ మరియు ‘మర్యాద రామన్న’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు విలన్ గా సౌత్ ఇండియా లో ఫుల్ బిజీ గా కొనసాగుతున్నాడు.
ఇకపోతే కమెడియన్ సునీల్ కి కూడా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో కొన్ని అవమానాలను ఎదురుకున్నాడు. అప్పట్లో సునీల్ ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ తో చాలా చనువు గా మాట్లాడేవాడట. ఆమె కూడా సునీల్ తో అలాగే ఉండేది. కానీ ఒకానొక సందర్భం లో సునీల్ వేసిన పంచులకు ఆమె బాగా హర్ట్ అయ్యి చెంప దెబ్బ కొట్టిందట. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష అట.
సునీల్ అప్పట్లో హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ‘అందాల రాముడు’. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ని అనుకున్నారట. ఆమెను కలిసి స్టోరీ మొత్తం వివరించగా, ఆమె స్టోరీ బాగా నచ్చి హీరో ఎవరు అని అడిగిందట. దానికి నిర్మాత సునీల్ అని సమాధానం ఇవ్వగానే అతనితో అయితే అసలు చెయ్యను, నన్ను క్షమించండి అని ఆ చిత్ర దర్శక నిర్మాతలను పంపేసిందట. ఆమె అలా రిజెక్ట్ చెయ్యడానికి కారణం, గతం లో వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటనే కారణం అని అంటున్నారు.