Devara : అందరి ముందు నోరు పారేసుకున్న శృతి… లబోదిబోమంటున్న దేవర చిత్ర బృందం

- Advertisement -

Devara : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే మరాఠీ నటి శృతి మార్తే సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మేకర్స్‌కి కొన్ని తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ లుక్ తాలూకా పిక్స్, వీడియోలు నెట్‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో కీలక అప్‌డేట్ రివీల్ అయింది. ఈ సినిమాలో కీలక పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని నటి శ్రుతి మార్తే వెల్లడించడంతో లబోదిబోమంటున్నారు మేకర్స్.

ఆర్‌ఆర్‌ఆర్‌తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన ఎన్టీఆర్ తర్వాత తొలి చిత్రం దేవర కావడంతో ఈ సినిమాపై మంచి హైప్‌ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు.. అక్టోబర్ 10న ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఇందుకోసం శరవేగంగా షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో లీక్‌ల ప్ర‌మాదం పెరుగుతుండ‌డంతో యూనిట్ పలు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం దేవర షూటింగ్ గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్‌లో జాన్వీతో డ్యూయెట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గోవాలోని సముద్రం దగ్గర షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్టీఆర్ తన పాత్రకు తగ్గట్టుగా సముద్రం నుంచి నడుచుకుంటూ వస్తున్న వీడియో వైరల్ గా మారింది. దూరంగా చెట్టుపై నుంచి ఎవరో వీడియో చిత్రీకరించి లీక్ చేశారు.

- Advertisement -

ఈ వీడియో అభిమానుల్లో ట్రెండ్ అవుతోంది. దీంతో యూనిట్ చేసేదేమీ లేక ఎన్టీఆర్ పిక్స్ రిలీజ్ చేసింది. కాగా, మరాఠీ బ్యూటీ శృతి దేవర సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దేవర సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవర భార్యగా నేను నటిస్తున్నాను.. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని శ్రుతి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాలో జాన్వీ తంగం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే వాస్తవానికి ఈ పాత్రను గోప్యంగా ఉంచాలని మేకర్స్ భావించారు. అయితే ఈ విషయాన్ని శృతి వెల్లడించడంతో మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here