టాక్ వచ్చినా వసూళ్లు లేవు..దారుణంగా తయారైన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ మూవీ పరిస్థితి!

- Advertisement -

‘జాతి రత్నాలు ‘ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో నవీన్ పోలిశెట్టి నుండి సినిమాలు రాలేదు. చాలా గ్యాప్ వచ్చింది, ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో నవీన్ ఈపాటికి రెండు మూడు సినిమాలు చేసి విడుదల చేసి ఉండొచ్చు, కనీసం ఒక్క సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. కానీ తన రెండున్నర సంవత్సరాల విలువైన సమయాన్ని ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం కోసం కేటాయించాడు. ఈ సినిమా లో హీరోయిన్ అనుష్క శెట్టి నటించింది.

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి
మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి

ఈమె కూడా భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని, ఈ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది. ఒక డిఫరెంట్ కథాంశం తో తెరకెక్కిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా, నవీన్ పోలిశెట్టి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఈ చిత్రాన్ని నిలబెట్టింది, టాక్ బాగా వచ్చింది.

కానీ కలెక్షన్స్ మాత్రం నిల్. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం దారుణంగా వసూళ్లు పడిపోయాయి. ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతం లో కూడా ఈ చిత్రానికి మరీ దారుణంగా 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా ఆంధ్ర ప్రాంతం మొత్తం కలిపి ఈ చిత్రానికి కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి రోజు 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

- Advertisement -

అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, ఓవర్సీస్ లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఆరు కోట్ల రూపాయలకు మించి ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు, అలా టాక్ వచ్చి కూడా డిజాస్టర్ వసూళ్లను సొంతం చేసుకొని డీలాపడింది ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి‘ చిత్రం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here