Payal ghosh : కొంతమంది హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేని ముఖాలు కొన్ని ఉంటాయి.అలాంటి హీరోయిన్స్ లో ఒకరు పాయల్ ఘోష్.ఈమె పేరు వింటే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ,ముఖం చూస్తే మాత్రం గుర్తు పట్టేస్తాం.మంచు మనోజ్ హీరో గా నటించిన ప్రయాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఇక రెండవ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో ‘ఊసరవెల్లి’ అనే చిత్రం లో నటించింది.

ఈ సినిమాలో ఆమె హీరోయిన్ తమన్నా కి స్నేహితురాలిగా నటించింది.సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా మంచి పాత్ర దక్కడం తో గుర్తింపు లభించింది.ఆ తర్వాత ఈమె మిస్టర్ రాస్కేల్ అనే చిత్రం లో నటించింది.ఆ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు.అయితే సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పాయల్ ఘోష్ రీసెంట్ గా ఒక ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆమె మాట్లాడుతూ ‘నేను సౌత్ ఇండియన్ ఫీల్మ్ ఇండస్ట్రీ లో రెండు నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకున్న డైరెక్టర్స్ తో పని చేశాను, ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ తో పని చేశాను,వాళ్ళు నన్ను ఎన్నడూ కూడా పొరపాటున టచ్ కూడా చెయ్యలేదు.కానీ బాలీవుడ్ లో నేను ఇంకా నటించకముందే అనురాగ్ కశ్యప్ అనే అతను నన్ను రేప్ చేసాడు.ఇప్పుడు చెప్పండి నేను సౌత్ ఇండియన్ ఫీల్మ్ ఇండస్ట్రీ తరుపున సపోర్టుగా ఎందుకు మాట్లాడకూడదో? ‘ అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

దీనిపై సోషల్ మీడియా లో అనేక చర్చలు జరుగుతున్నాయి.పాయల్ ఘోష్ కేవలం అటెన్షన్ కోసమే ఇలా మాట్లాడుతుంది అని కొంతమంది నెటిజెన్స్ కామెంట్ చేస్తుంటే,అధిక శాతం ఆమెకి సపోర్టు చేస్తున్న వాళ్ళే ఉన్నారు.సెలబ్రిటీ హోదా లో ఉన్న ఒక అమ్మాయికి ఈ సమాజం లో రక్షణ లేకపోతే ఇక సామాన్య ఆడపిల్లల పరిస్థితి ఏమిటి అని నెటిజెన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
