Baby Movie review : ‘బేబీ’ మూవీ మొట్టమొదటి రివ్యూ..ఇలాంటి లవ్ స్టోరీ ఈమధ్య కాలంలో రాలేదు!

- Advertisement -

Baby Movie review : అతి త్వరలోనే విడుదల అవ్వబోతున్న సినిమాలలో ట్రేడ్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘బేబీ’. విజయ్ దేవరకొండ సొందరుడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన ఈ సినిమాకి కలర్ ఫోటో సినిమాని నిర్మించిన సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Baby Movie review :
Baby Movie review

ఇక రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. డైలాగ్స్ ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా చాలా చక్కగా రాసుకున్నాడు సాయి రాజేష్. దీనితో ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్ దక్కడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్. ఇక ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా, SKN నిర్మాతగా వ్యవహరించాడు.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షో ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది బయ్యర్స్ కి , మీడియా ప్రముఖులకి మరియు సినీ పరిశ్రమకి చెందిన కొంతమంది ముఖ్యులకు వేసి చూపించారట. వాళ్ళ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధమైన సన్నివేశాలు మాత్రమే కాకుండా , గుండెల్ని హత్తుకునే సన్నివేశాలు కూడా సమపాళ్లలో ఉన్నాయని, రీసెంట్ సమయం లో ఇంత చక్కటి లవ్ స్టోరీ రాలేదని అంటున్నారు.

- Advertisement -

ఇక ఈ చిత్రం లో వైష్ణవి చైతన్య నటన హైలైట్ గా నిల్చిందట, వివిధ రకమైన షేడ్స్ తో ఆమె దుమ్ము లేపేసినట్టు సమాచారం. ఇక ఆనంద్ దేవరకొండ మరియు విరాక్ అశ్విన్ లు కూడా తమ పరిధిమేర చక్కగా నటించారట. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ పరంగా ఈ సినిమా రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమాలు లాగానే ప్రభంజనం సృష్టించబోతోందా లేదా అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here