Telugu Movies : తెలుగులో రకరకాల కంటెంట్ తో సినిమాలు చేస్తున్నారు.. జనాలను థియెటర్లకు రప్పించడానికి చెత్త సినిమాలు కూడా ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసింది..మొదట్లో ముద్దు వరకూ ఉన్న సినిమాలు ఇప్పుడు హద్దులు చెరిపెసి శృతి మించిన శృంగారపు సీన్లను చూపిస్తున్నారు.. అలాంటి సినిమాల పై విమర్శలు వస్తున్నా ఇంకాస్త బోల్డ్ గా సినిమాలు తీస్తున్నారు. ఇక ఆర్జీవి లాంటి డైరెక్టర్ ఏం తీస్తాడో ఆయనకే తెలియదు…

సినీ పరిశ్రమలో రసిక ప్రియులను ఎంటర్‌టైన్ చేస్తూ విడుదలైన అడల్ట్ సినిమాలు. రెండు మూడేళ్ల కింది వరకు కేవలం బాలీవుడ్‌లో మాత్రమే ఈ అడల్ట్ సినిమాల జోరు ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం తెలుగులో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగు లో యూత్ ని టార్గెట్ చేస్తు అడల్ట్ రొమాంటిక్ టచ్ ఓ రేంజ్‌లో చూపిస్తూ ఈ ఏడాది 2019 లో చాలా సినిమాలు విడుదలయ్యాయి..ఆ సినిమాలు ఏంటో ఓసారి లుక్ వేసుకోండి..
చీకటి గదిలో చితక్కొటుడు..

చీకటి గదిలో చితక్కొటుడు సినిమా కామెడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇందులొ అదిత్ అరుణ్, నిక్కి టంబోలి, భాగ్యాశ్రీ మోట్, రమేష్ కుమార్, రఘుబాబు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్ తదితరులు నటించారు. సంతోష్ పీటర్ జయకుమార్ దర్శకత్వం వహించారు. బాలమురళి బాల సంగీతమందించారు.ఈ సినిమాలో వయాగ్రా పేరు చెప్పి అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించారు..హారర్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం బూతు కంటెంట్ తో నింపేశారు. బూతు డైలాగ్స్, డబుల్ మీనింగ్ మాటలు ఎక్కువగా వున్నాయి.
ఏడు చేపల కథ..

ఏడు చేపల కథ సినిమా అడల్ట్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, మేఘ చౌదరి, నగరం సునీల్ తదితరులు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ జె చైతన్య వహించారు చరిత్ర సినిమా ఆర్ట్స్, రాకేష్ రెడ్డి సమర్పణలో జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కవి శంకర్ అందించారు. ఏడు చేపల కథ.. ఈ సినిమా పక్కా అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన సినిమా. రసిక ప్రియులను ఎంటర్‌టైన్ చేయటానికి అడల్ట్ సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే వున్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.. ఇది బూతు సినిమానే అని చెప్పాలి..
రాయలసీమ లవ్ స్టోరీ..

రాయలసీమ లవ్‌స్టోరి సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకట్, పావని, నాగినీడు , 30 ఇయర్స్ పృథ్వీ , జీవా , నల్ల వేణు , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , కొమరం , జబర్దస్త్ రాజమౌళి , మిర్చి మాధవి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ , మధుమని తదితరులు నటించారు. A1 ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ద్వారా రామ్ రణధీర్ దర్శకుడిగా పరిచయం అయ్యరు. పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా నిర్మించారు. సంగీతం శ్రీ సాయి యెలెందర్ అందించారు…రాయలసీమ లవ్ స్టొరీ యూత్‌ని అలరించే సన్నివేశాలతో తెరకెక్కిన చిత్రం..ఇందులో కూడా భారీగా బోల్డ్ సినిమానే యువతను రెచ్చగొట్టిన సినిమానే..
RDX లవ్..

తొలి చిత్రం `ఆర్.ఎక్స్.100`లో ఘాటైన పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది పాయల్ రాజ్‌పుత్. `ఆర్.డి.ఎక్స్.లవ్` ప్రచార చిత్రాల్లో ఆమె హంగామా చూశాక… తెలుగులో బోల్డ్ పాత్రలకి పెట్టింది పేరన్నట్టుగా మారింది. పాయల్ రాజ్‌పుత్ మార్క్ రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం కుర్రకారుని ఆకర్శించాయి..కండోమ్ వాడాలి అంటూ ఈ సినిమాలో పదే పదే చూపించి విమర్శలు అందుకుంది..కానీ హిట్ టాక్ ను అందుకోలేక పొయ్యింది..
పైన చెప్పిన సినిమాలు అన్నీ కూడా యువతకు మూడ్ తెప్పిస్తున్నాయి విమర్శలు అందుకున్నాయి..ఈ మధ్య మళ్ళీ కంటెంట్ ను మార్చారు..ప్రస్తుతం యాక్షన్, రొమాంటిక్ సన్నీ వేశాలు ఉన్న సినిమాలు వస్తున్నాయి..స్టార్ హీరోలు సైతం అలాంటి సినిమాలే చేస్తుండటం విశేషం..