Aishwarya: ప్రముఖ సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్యా భాస్కరన్ గురించి పరిచయం అవసరం లేదు. తల్లిని ఫాలో అవుతూ అడవిలో అభిమన్యుడు అనే చిత్రంతో హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసింది ఐశ్వర్య. దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా, కీలక పాత్రధారిగా నటించి ఆకట్టుకున్నారు. హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య.. క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. పలు సినిమాల్లో సహాయనటిగా కనిపించి అలరించింది. అయితే ఆమె ఈ వయసులోనూ క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొందిట. తెలుగుతో పాటు తమిళ, మలయాళీ చిత్రాల్లో నటించి సత్తా చాటిన ఆమె. తాను లైగింక వేధింపులకు గురైనట్లు తెలిపారు.
ఆన్‌లైన్‌లో తాను ఎదుర్కొంటోన్న లైంగిక వేధింపులపై మాట్లాడుతూ.. ఇటీవల, తన యూట్యూబ్ ఛానెల్ మల్టీ మమ్మీలోని ఒక వీడియోపై స్పందిస్తూ.. చాలా మంది నెటిజన్స్ ఆన్‌లైన్‌లో తనకు అసహ్యకరమైన సందేశాలను పంపారని.. అది ఏంతో బాధను కలుగజేసిందని తెలిపారు. అంతేకాదు కొన్ని ఫోటోలు, మెసేజ్‌లు కూడా తనకు మానసిక వేదనకు గురిచేశాయని ఐశ్వర్య తెలిపారు. ఒక వ్యక్తి తనకు అర్థరాత్రి ఓ మేసేజ్ పంపాడని.. ఇప్పుడు ఇంటికి వచ్చి సబ్బులను చూపించని కోరాడని వాపోయింది.
ఐశ్వర్య తన యూట్యూబ్ ఛానెల్‌లో రకరకాల వంటకాలు, సబ్బు తయారీ, ఆధ్యాత్మికత అంశాలపై సోషల్ మీడియా లో వీడియోలు చేస్తుంటుంది. ఆమె సబ్బులు కూడా అమ్ముతుంది. ప్రస్తుతం నటనకు అవకాశాలు లేకపోవడంతో సబ్బు వ్యాపారం ఇప్పుడు తనకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని కూడా ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న తనకు చాలా మంది పురుషులు ఆన్ లైన్‌లో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. అయితే ఈ విషయంలో ఆమె తనకు జరుగుతోన్న వేధింపులను, హారాస్ చేసే నెటిజన్స్‌ను బహిర్గతం చేయడంతో కొందరు నెటిజన్స్ ఆమె సపోర్ట్‌గా నిలిచారని తెలిపింది. సానుకూల వ్యాఖ్యలతో మద్దతు ఇచ్చారని పేర్కోంది.