Samyuktha Menon: వైట్ శారీలో సంయుక్త మెస్మరైజింగ్ పోజులు

- Advertisement -

Samyuktha Menon:సంయుక్త మీనన్.. ఈ కేరళ కుట్టి ప్రస్తుతం టాలీవుడ్​లో బిజీ హీరోయిన్. ఈ భామ సాయిధరమ్ తేజ్​తో కలిసి నటించిన విరూపాక్ష సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ మూవీ ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సంయుక్త బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం సంయుక్త ట్రెడిషనల్ ఔట్​ఫిట్స్​నే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటోంది.

Samyuktha Menon
Samyuktha Menon

ఇప్పటి వరకు విరూపాక్ష ట్రైలర్ లాంఛ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ట్రెడిషనల్ ఔట్​ఫిట్స్​లో కనిపించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలిచింది. తాజాగా మీడియా, ఫ్యాన్స్​తో ఇంటరాక్షన్​లో ఈ బ్యూటీ వైట్ శారీలో కనిపించింది. సంయుక్త తెల్ల చీరలో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ కేరళ కుట్టి తమ సంప్రదాయ వస్త్రధారణలో విరూపాక్ష ప్రమోషన్స్​లో పాల్గొంది. వైట్ శారీలో నుదుట బొట్టు పెట్టుకుని చాలా సింపుల్​గా.. ఎంతో బ్యూటీఫుల్​గా కనిపించింది. సంయుక్త సింప్లిసిటీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ భామ చీరకట్టులో కాటుక కళ్లతో కనికట్టు చేసేసింది. క్యూట్ పోజులిస్తూ కుర్రాళ్లను కవ్వించింది.

Samyuktha
Samyuktha Menon

సంయుక్త లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తెల్ల చీరలో సంయుక్త మరింత అందంగా ఉందంటూ నెటిజన్లు అంటున్నారు. చీరకట్టులో ఈ బ్యూటీ కుందనపు బొమ్మలా కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాటుక కళ్లను చూస్తే పోతుందే మతి పోతుందే అని ఒకరు పాడుతుంటే.. కాటుక కళ్లు.. కాటుక కళ్లు.. ఏమంటున్నాయో అని ఇంకొందరు పాటలు పాడేసుకుంటున్నారు.

- Advertisement -
Menon

చీరకట్టులో ఎలాంటి ఎక్స్​పోజింగ్ లేకుండా నిండుదనంతో కనిపిస్తున్న సంయుక్తను చూసి నెటిజన్లు ముచ్చట పడుతున్నారు. ఇలాంటి సంప్రదాయమైన లుక్​లో హీరోయిన్లను చూసి ఎన్నాళ్లయిందో అంటూ మాట్లాడుకుంటున్నారు.

Samyu

ఇక సంయుక్త సినిమాల విషయానికి వస్తే ఈ భామ నటించిన విరూపాక్ష ఈనెల 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ భామ సార్ సినిమాతో బంపర్ హిట్ కొట్టింది. ఇక విరూపాక్ష సినిమా కూడా హిట్ అయితే సంయుక్త టాలీవుడ్​లో బిజీ అయిపోవడం ఖాయమని సినీ వర్గాల్లో టాక్

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here