Mirai Glimpse : వారియర్ గా తేజ సజ్జా.. పవన్ కల్యాణ్ OG కి పోటీ ఇస్తున్నాడా?

- Advertisement -

Mirai Glimpse :  ‘హనుమాన్’ సినిమాతో మాసివ్ సక్సెస్​ అందుకున్న హీరో తేజ సజ్జా. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా తన ప్రయాణం మొదలు పెట్టిన తేజ నెమ్మదిగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోగా కెరీర్ లో రాణించాలని తాపత్రయపడుతుంటారు. కానీ అలా వచ్చి ఇలా వరుస ప్లాఫ్ లతో వెళ్లిపోతుంటారు. కానీ తేజ సజ్జా సినిమా కెరీర్ కాస్త డిఫరెంట్. తేజ డైరెక్ట్ గా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. బేబీ లాంటి సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించి తన ప్రజెన్స్ ను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశాడు. అరే ఇతను హీరో మెటీరియలే అని అనిపించేలా చేసుకున్నాడు.

Mirai Glimpse
Mirai Glimpse

ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మూస ధోరణిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లకుండా కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో తేజకు దక్కిన వరం హను-మాన్. ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాదు యంగ్ హీరో కాస్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ చిత్రం తర్వాత తేజ అంతకుమించిన సినిమా ఏదో చేస్తే కానీ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేరు. ఇలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తర్వాత వరుస ప్లాఫ్ లతో ఇండస్ట్రీకి టాటా బైబై చెప్పిన వారున్నారు. కానీ తేజను చూస్తుంటే తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. తాజాగా తేజ నటించిన లేటెస్ట్ మూవీ అప్డేట్ చూస్తుంటే ఇది నిజమే అనిపించక మానదు.

తేజ సజ్జ  ఇప్పుడు మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై తెరకెక్కుతున్న మిరాయ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.  తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ వదిలారు. మిరాయ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ చూస్తుంటే ప్రతి ఫ్రేమ్ అద్భుతమే అనిపిస్తోంది. మిరాయ్ – సూపర్ యోధ అనే క్యాచీ లైన్ తో వస్తున్న ఈ సినిమా తేజ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందేమోనని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

Teja Sajja new Movie

ఇక గ్లింప్స్ విషయానికి వస్తే.. కళింగ యుద్ధం తర్వాత యోగిగా మరిపోయిన అశోకుడు గురించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అశోకుడిని యోగిగా మార్చిన తొమ్మది గ్రంథాల సమాహారం కోసం జరిగే పోరాటమే ఈ సినిమా స్టోరీ. అయితే వాటిని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు. కాపాడటం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ యోధుడే తేజ సజ్జా. ఆ గ్రంథాలను కాపాడేందుకు వచ్చిన హీరో, తనకు ఎదురయ్యే ప్రమాదాలను అధిగమిస్తూ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే అసలు స్టోరీ.

ఈగల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకు డైరెక్టర్. ఇందులో తేజ సజ్జతో పాటు యంగ్ హీరోయిన్ రితికా నాయక్ నటించనుంది. మంచు మనోజ్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్​ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లే మేకర్స్ అప్పుడే రిలీజ్​ డేట్​ను కూడా అనౌన్స్ చేశారు. గౌరహరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

విజువల్స్, బ్యాక్​గ్రౌండ్ స్కోర్​తో పాటు అశోకుడి నేపథ్యంలో సాగే కథ్ ఇలా పలు ఎలిమెంట్స్ కూడా సినిమాపై అంచలనాలు మరింత పెంచాయి. సాంకేతిక విలువలు కూడా ఉన్నతంగా ఉన్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.  పలు భారతీయ భాషలతో పాటు కొన్ని ఫారిన్​ ఇండియన్ లాంగ్వేజ్స్​లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా గ్లింప్స్ చూసిన నెటిజన్లు దీన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ OG మూవీతో పోలుస్తున్నారు. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ చూస్తుంటే ఓజీ ని పోలి ఉన్నట్లుగా అనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఓజీ గ్లిమ్స్ లో పవన్‌ కళ్యాణ్ కత్తి పట్టి తిప్పడం, ఆ టైటిల్ ఫాంట్‌ అన్నీ కూడా మిరాయ్ సినిమా కు దగ్గరగా ఉన్నట్లుగా కనిపించడం కూడా ఈ పోలికకకు ఓ కారణమని చెప్పొచ్చు. అయితే  ఓజీ, మిరాయ్ పాత్రలు చూడటానికి దగ్గరగా కనిపిస్తున్నా ఓజీతో పోలిస్తే తమ సినిమా పూర్తి విభిన్నంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here