Pallavi Prashanth : రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ ఇంస్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడంటే ఆయన కామన్ మ్యాన్ గా ప్రాజెక్ట్ అయ్యాడు కానీ, ఇంస్టాగ్రామ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టముందే ఆయనకీ 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమర్ కంటే రెండు రెట్లు ఎక్కువ ఫాలోవర్స్ ఆయనకీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే ఉంది.
అంతే కాదు ఆయనకీ ఫేస్ బుక్ లో పోస్ట్ పెడితే 30 వేల లైక్స్ వచ్చే ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సోషల్ మీడియా లో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో అడుగుపెట్టే ముందు అర్జున్, అమర్ మరియు ప్రియాంక కంటే ఫేమస్ సెలబ్రిటీ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనాధాకారిక పొలింగ్స్ లో ప్రశాంత్ మొదటి వారం నుండే భారీ మార్జిన్ ఓట్లతో అందరికంటే ముందు ఉన్నాడు.
అంతే కాదు ప్రశాంత్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు చాలా ఏజెన్సీల సప్పోర్టుని కూడా తీసుకున్నాడట. హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో మనోడు సింపతీ యాంగిల్స్ ని ఉపయోగించి కెమెరాలకు కనిపించేటట్టు చాలా విన్యాసాలు చేసాడు. ఇప్పుడంటే ప్రశాంత్ ఆట అందరికీ తెలుసు, నిజంగానే అద్భుతమైన టాస్క్ ప్లేయర్, కానీ మొదటి రెండు మూడు వారాల్లో ప్రశాంత్ ఆట పెద్దగా ఏమి కనిపించలేదు. రతికా చుట్టూ తిరగడానికే సమయం సరిపోయింది, అయినా కూడా ప్రశాంత్ కి ఇంత ఓటింగ్ ఎలా వస్తుంది అనేది ఎవరికీ అర్థం అయ్యేది కాదు.
దాని వెనుక ఇంత పెద్ద కారణం ఉంది. ఇకపోతే ప్రశాంత్ టీం తన సొంత ఊరిలో గ్రాండ్ ఫినాలే కి తనకి ఓట్లు పడేందుకు ప్రతీ ఇంటికి ఒక బియ్యం ప్యాకెట్ ని ఉచితంగా అందిస్తున్నారట. ప్రస్తుతానికి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అనేది దాదాపుగా ఖరారు అయిపోయింది. అయినప్పటికీ కూడా తన గ్రామం లో ఉన్న వారికి ఉచితంగా బియ్యం ఇవ్వడం పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.