Aishwarya Rai : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ – అభిషేక్ బచ్చన్ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జంట బాలీవుడ్‌లోని టాప్ సెలబ్రిటీ జంటలలో ఒకటి. ఈ జంట విడిపోతున్నారనే వార్త చాలా కాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బచ్చన్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అత్త జయా బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ లకు ఒకరంటే ఒకరికి అసలు పడట్లేదట. అంతే కాకుండా అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ నందా, ఐశ్వర్యారాయ్ మధ్య ఇగో సమస్యలు ఉన్నాయట.
అయితే ఈ జంట విడిపోయినట్లు వస్తున్న వార్తలపై మాత్రం ఎవరూ స్పందించలేదు. అంతేకాకుండా బహిరంగంగానూ వారు పెద్దగా కనిపించలేదు. అయితే రీసెంట్‌గా ఓ ముఖ్యమైన ఈవెంట్‌లో వీరిద్దరూ జంటగా కనిపించారు. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలకు చెక్ పడినట్లే. ఈ జంట తమ కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ఆర్చీస్ ప్రీమియర్‌కు హాజరయ్యారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. అమితాబ్ బచ్చన్, ఆరాధ్య, ఐశ్వర్య, అభిషేక్ ఫోటోలకు పోగులిచ్చారు. కాగా అగస్త్య నంద చిత్రం ది ఆర్చీస్ ప్రీమియర్ షోకి వచ్చిన ఈ ఫ్యామిలీ.. ఒక్కటిగా కనిపించడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.
మొదట అభిషేక్, ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నారనే అనుమానం వచ్చిందని.. వాళ్లను చూడండి అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా.. ఆరాధ్యను ఐశ్వర్య పట్టించుకోవడం లేదని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. ఐశ్వర్య – అభిషేక్ విడాకులు తీసుకోరని అనుకుంటున్నా అని మరొకరు చెప్పగా.. అందరూ నోరు విప్పి ఐశ్వర్య – అభిషేక్ విడాకుల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఐశ్వర్య – అభిషేక్, ఆరాధ్య, అమితాబ్‌లతో జరిగిన ఈవెంట్ వీడియోతో పాటు ఈ వీడియోపై మొదలైన ఆసక్తికర చర్చలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.