Koratla Shiva : శ్రీమంతుడు సినిమా కాపీరైట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువడింది. ఫోర్జరీ, మోసం ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని.. వారిపై కేసు కొనసాగింపు చెల్లదని హైకోర్టు వివరించింది. కాపీరైట్ ఉల్లంఘన కేసును దర్శకుడు, రచయిత మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ కె.సురేందర్ రెడ్డి తీర్పునిచ్చారు. శ్రీమంతుడు సినిమా నవలకు కాపీ అని 8 మంది రచయితల కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. అంతేకాదు ఇది మోసం, ఫోర్జరీ కిందకు రాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాని నిర్మించడంతో పాటు కథ, రచన, స్క్రీన్ ప్లేకు కూడా దర్శకుడే ఖర్చు పెట్టి చేయడం కారణంగా ఆయనే దీనికి బాధ్యత వహించాలని స్టేట్ మెంట్ ఇచ్చారు. నిర్మాతలపై కేసును కొనసాగించలేమని స్పష్టం చేశారు. కథా రచయితగా మరొకరి పేరు ఉండడంతో దర్శకుడు కొరటాలపై, నిర్మాత యర్నేని రవి, మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కూడా రచయిత శరత్‌చంద్ర అలియాస్ ఆర్ డి విల్సన్ క్రిమినల్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టేయాలని వారంతా వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు వేశారు.
అదే సమయంలో తమపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేసి ఉత్తర్వులు జారీ చేయాలని శరత్‌చంద్ర పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిపై హైకోర్టులో విచారణ జరగగా.. హైకోర్టు న్యాయవాది ప్రధాన కథనంలో స్వల్ప మార్పులు చేర్పులు చేసి తన సొంత కథ అని చెప్పుకోవడం కూడా కాపీరైట్ ఉల్లంఘనేనని పేర్కొన్నారు. రచయిత కమిటీ నిర్ణయం ప్రకారం ఇది కాపీరైట్ ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈలోగా నిర్మాత, మహేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఉన్న కేసులు మూతపడ్డాయి. అదేవిధంగా విల్సన్ పిటిషన్ ఫోర్జరీ, మోసం అని కొట్టివేసింది. దర్శకుడు కొరటాల కాపీరైట్‌పై విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి వెల్లడించారు.