ఆ హీరో కొడుకు వల్లే తాప్సీ టాలీవుడ్ కు దూరమైందా..!

- Advertisement -

రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ తాప్సి. ఝుమ్మంది నాదం సినిమాలో మంచు మనోజ్ సరసన నటించి తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి వరుస విజయాలు అందుకుంది. కానీ కెరీర్లో తాప్సీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గానే నటించడంతో ఆమెకు మెయిన్ హీరోయిన్ ఛాన్సులు తగ్గాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిందనే వార్తలు వచ్చాయి.

తాప్సీ
తాప్సీ

అదే సమయంలో బాలీవుడ్ లో అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి క్లిక్ అయింది తాప్సీ. అయితే వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమకు తాప్సీ దూరం కావడానికి ఆమెకు బలమైన కారణం ఉందట. అదేంటంటే.. టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో కొడుకు తాప్సీతో మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేసి తన వెంట తిప్పుకున్నాడట. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారట. చివరకు పెళ్లి అనే సరికి చేతులెత్తేశాడట. ఈ ప్రేమ విఫలమైన బాధను తట్టుకోలేక తాప్సీ అతని ముందు ఇండస్ట్రీలో ఉండలేక విడిచి వెళ్లిపోయిందంట. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయంపై తాప్సీ ఎప్పుడూ స్పందించలేదు.. గతంలో కాస్త బొద్దుగా ఉన్న తాప్సీ రకరకాల జిమ్ వర్కౌట్స్ చేసి స్లిమ్ అయింది. ఈ క్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అంతే కాకుండా సోషట్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈ క్యూటీ తరచుగా గ్లామర్ ఫోటోలను అందులో తన అభిమానుల కోసం పంచుకుంటుంది. గతంలో తాప్సీ తన బొడ్డు పై పండ్లు పువ్వులు కొట్టి రాఘవేంద్రరావు ఆనందం పొందారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాకు హాట్ టాపిక్ గా మారిన ఈమె మరో సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో తాను నటించే హీరో మార్కెట్ బట్టి తన పారితోషికం తగ్గించుకోమంటున్నారు అంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ సమర్ధత గుర్తించరు అంటూ మరో వివాదానికి తెర తీసింది.కొన్ని నెలల క్రితం ఒక టాలీవుడ్ నిర్మాత తనను సంప్రదించి ఒక మీడియం రేంజ్ హీరోతో తాను తీయబోతున్న సినిమా కథ చెప్పి అందులో తనను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్న విషయాన్ని బయట పెట్టింది. అయితే ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకు తిరిగి ఆమూవీ నిర్మాత తన దగ్గరకు వచ్చి ఆ హీరో సినిమాలు అన్నీ ఫెయిల్ అయి మార్కెట్ తగ్గిపోతున్న పరిస్థుతులలో తన పారితోషికం మరింత తగ్గించుకోమని చెప్పిన విషయాలను గుర్తుకు చేసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here