కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. రజనీ కాంత్ అల్లుడిగా పేరున్నా వారసత్వంపై ఆధారపడకుండా కేవలం తన సొంత టాలెంట్ తోనే సినీ ఇండస్ట్రీలో పెద్ద స్ధాయికి ఎదిగారు. కోలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగు తెరకు పరిచయమై ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. రఘువరన్ బీటెక్, నవ మన్మధుడు చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు. ధనుష్ రీసెంట్ గా సార్ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం ధనుష్ ఇండియా లెవెల్ లో తన చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.
ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు ధనుష్. అంతా బాగానే ఉన్న తరుణంలో కోలీవుడ్ పెద్దలు ధనుష్ పట్ల ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వినికిడి. తమిళ నిర్మాతల మండలి ధనుష్ కు రెడ్ కార్డ్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిర్మాతలు ధనుష్ తో సినిమాలు చేయడానికి సాధ్యం కాదన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇందుకు గల కారణం ధనుష్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తెంద్రల్ ఫిలిమ్ నిర్మాణంలో ఒక సినిమాలో నటిస్తానని మాట ఇచ్చారట అందుకోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నారట.
డబ్బులు తీసుకుని చాలా కాలమవుతున్న సినిమా మాత్రం చేయలేదట. ఇక అప్పటినుంచి అడుగుతున్న ఇప్పటివరకు సినిమా చేయకపోవడంతో నిర్మాత తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారట. ఈ ఫిర్యాదుతో ధనుష్ పైన చర్యలు తీసుకోవడం కోసం తమిళ నిర్మాత మండలి రెడీ అవుతున్నారట. నిర్మాతను మోసం చేసినందుకు గాను రెడ్ కార్డు జారీ చేసే ఆలోచనలో నిర్మాతల మండలి ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో దీనిపై ధనుష్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.