Nayanthara ను బ్యాన్ చేయనున్న తమిళ్ ఇండస్ట్రీ.. కారణం ఇదేనా?

- Advertisement -

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతారా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..తెలుగు, తమిళ ప్రేక్షకులకు సూపరిచితమే.. ఎన్నో హిట్ సినిమాలల్లో స్టార్ హీరోల సరసన నటించింది.. తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. పెళ్లి తరువాత గుళ్ళు గోపురాలు తిరుగుతూ కనిపించింది. పెళ్ళైన దగ్గరనుంచి అమ్మడికి వివాదాలకు మాత్రం తక్కువ లేదు. అంతేకాదు సినిమాలకన్నా ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది..ఇప్పుడు ఓ అభిమాని పై నిప్పులు చెరిగింది.. అది కాస్త తమిళ తంబీల ఆగ్రహానికి దారితీసింది.. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది..

nayanthara
Nayanthara

పెళ్లి తరువాత మొదటిసారి గుడికి వెళ్తూ చెప్పులు వేసుకొని కనిపించి ఒక వివాదానికి తెరలేపింది. ఆ తరువాత సరోగసీద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఇక్కడితో వివాదాలు ముగిశాయి అనుకొనేలోపు మరో వివాదానికి తెరలేపింది. తాజాగా విగ్నేష్- నయన్ దంపతులు తమిళనాడు రాష్ట్రం కుంభకోణం సమీపంలోని మెళవత్తూర్ గ్రామంలోని కామాక్షి అమ్మవారి ఆలయంను సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక నయన్ వచ్చిందని తెలియడంతో అభిమానులు ఆమెను చూడడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.

nayanthara Photos

అక్కడ జనాన్ని చూసిన నయన్ వారిపై కోపంతో ఊగిపోయింది..ఒక్క ఐదు నిముషాలు ఆగలేరా..? నేనూ మీలానే పూజ చేయించడానికి వచ్చాను. అమ్మవారి దర్శనం చేసుకోనివ్వరా.. అంటూ జారీచేసింది. ఆ తరువాత ఒక అభిమాని నయన్ ను ఫాలో చేస్తూ ఆమె దగ్గరకంటా వచ్చి ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించగా.. అతడిపై కూడా నయన్ ఫైర్ అయ్యింది.

- Advertisement -

ఇంకోసారి ఫోన్ లో ఫొటో లేదా వీడియోను రికార్డ్ చేస్తే కచ్చితంగా మొబైల్ ఫోన్ పగిలిపోద్ది చెప్తున్న.. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సదురు అభిమాని ముఖం చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.. దీనిపై తమిళ సంఘాలు గుర్రుమంటున్నాయి.. నయనతార అంత దురుసుగా చెప్పాల్సిన పనిలేదు.. అంటూ మండిపడ్డారని తెలుస్తుంది..దీంతో నయనతారను బ్యాన్ చేయనున్న తమిళ్ ఇండస్ట్రీ.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. దీనికి అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here