Sivakarthikeyan : ముచ్చటగా మూడో సారి తండ్రి అయిన స్టార్ హీరో పోస్ట్ వైరల్ ?

- Advertisement -

Sivakarthikeyan : శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరుకే తమిళ నటుడు. కానీ తెలుగులోనూ ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’ లాంటి డబ్బింగ్ సినిమాలతో ఆయనకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. తెలుగు నాట శివ కార్తికేయన్​కు ఉన్న పాపులారిటీ చూసి ‘ప్రిన్స్’ అనే మూవీని బైలింగ్యువల్​గా నిర్మించారు. శివ కార్తికేయన్ నుంచి ఓ సినిమా వస్తోందంటే.. కోలీవుడ్​తో పాటు టాలీవుడ్​లోనూ క్రేజ్ ఉంటుంది. అలాంటి ఈ హీరో నుంచి ఓ గుడ్ న్యూస్ తెలుస్తోంది. శివ కార్తికేయన్ ముచ్చటగా మూడోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య ఆర్తి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో శివ కార్తికేయన్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. మూడో సారి తండ్రి అయినందుకు, పండంటి మగ బిడ్డ కలిగినందుకు శివ కార్తికేయన్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తోంది. జూన్ 2వ తేదీన తమకు బిడ్డ పుట్టాడని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించాడు. శివ కార్తికేయన్, ఆర్తి దంపతులకు ఆల్రెడీ ఓ పాప (ఆరాధాన), బాబు (గుగన్) ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మూడో సంతానానికి జన్మనిచ్చారు. మగ బిడ్డ పుట్టాడంటూ శివ కార్తికేయన్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.శివ కార్తికేయన్ చివరగా మహా వీరుడు అంటూ ఇక్కడి ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు. అయలాన్ మూవీ తమిళంలో వచ్చింది. కానీ తెలుగు రిలీజ్‌కు ఎందుకో తెలియదు కానీ ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికీ తెలుగు వర్షన్ అందుబాటులోకి రాలేదు. బుల్లితెర నుంచి వెండితెరకు ఎదిగాడు శివ కార్తికేయన్. సూపర్ స్టార్ రజినీ కాంత్ అభిమానిగా శివ కార్తికేయన్ స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ లు, చేసే మిమిక్రీలు అందరినీ ఆకట్టుకుంటాయి. నిర్మాతగానూ, సింగర్‌గానూ శివ కార్తికేయన్ జనాలకు దగ్గరయ్యాడు. ఇప్పుడు శివ కార్తికేయన్ ఆర్మీ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నారు.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here