Tamannaah : గత కొంతకాలం గా సోషల్ మీడియా లో తమన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.వీళ్లిద్దరు గురించి అలాంటి వార్తలు రావడానికి కారణం కూడా ఉంది, ఈ కొత్త సంవత్సరం పార్టీ లో వీళ్లిద్దరు ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకి చిక్కారు, అప్పటి నుండే ఈ వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అయ్యాయి.

ఈ వార్తలపై అటు తమన్నా కానీ,ఇటు విజయ్ వర్మ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.కానీ వీళ్లిద్దరు కలిసి షాపింగ్స్ చెయ్యడం, ప్రైవేట్ పార్టీలకు కలిసి వెళ్లడం వంటివి చాలా సార్లు చేసారు.కెమెరాలకు చిక్కారు కూడా, రీసెంట్ గా వీళ్లిద్దరు కారులో కలిసి వెళ్తున్న వీడియో సోషల్ మీడియా లో లీక్ అయ్యి వైరల్ గా మారింది.ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడవచ్చు.
ముంబై నడిరోడ్డు మీద విజయ్ వర్మ కారు ఆపడం, తమన్నా వచ్చి కారు ఎక్కడం మనం పైన వీడియోలో గమనించొచ్చు. చూస్తూ ఉంటె తమన్నా అప్పుడే జిమ్ లో వర్కౌట్స్ చేసి వస్తున్నట్టుగా ఉంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో కంటే కూడా బాలీవుడ్ మరియు కోలీవుడ్ లోనే ఎక్కువ గా సినిమాలు చేస్తుంది.తెలుగు లో ఆమె మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తుంది.

మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత ఆమె తమిళం లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్, ఆర్మనై 4 వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఇక మలయాళం లో ఆమె బాంద్రా అనే చిత్రం లో నటిస్తుండగా, హిందీ లో బోల్ చుడియన్ అనే చిత్రం లో నటిస్తుంది.
Love birds 🫶 #TamannahBhatia #vijayvarma papped together in mumbai#tamannah@tamannaahspeaks pic.twitter.com/f1nCZgNv11
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) April 24, 2023