Tamannaah Bhatia : క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ లో తమన్నా..!

- Advertisement -

Tamannaah Bhatia : తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోంది. అంతేకాకుండా ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలు మీద కూడా తమన్న ఫోకస్ పెట్టింది. ఈ క్రమంగా వచ్చిన సినిమాల్లో నుండి విజయం సాధించగా ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమా కి రెడీ అయింది తమన్నా. 2022 లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది అయితే ఈ సినిమా దర్శకుడు అశోక్ తేజ మళ్లీ ఈ సినిమా సీక్వల్ తీయబోతున్నారు.

ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో హెబ్బా పటేల్ పూజిత పొన్నాడ వశిష్ఠ ప్రధాన పాత్రలను పోషించారు క్రైమ్ అండ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది అయితే ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు రాబోతోంది. ఓదెల టు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో తమన్నా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఓదెల రైల్వే స్టేషన్ లో నటించిన వాళ్లతో పాటు తమన్న కూడా ఇందులో యాడ్ అయినట్లు తెలుస్తోంది. ఓదెల రైల్వే స్టేషన్ కి సీక్వెల్ కాదని మూవీ మేకర్స్ అంటున్నారు. ఓదెల టూ గా రాబోతోంది తప్ప సైక్వల్ కాదట మరి తమన్నా ఎలా అల్లరిస్తుందో చూడాలి.

ఓదెల పార్ట్ 1 చూసినట్లయితే కొత్తగా పెళ్లయిన ఆడవాళ్ళందర్నీ చంపే సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా వచ్చింది. హెబ్బా పటేల్ డీ గ్లామర్ రోల్ లో అందరికీ కనపడి అందరినీ మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు ఓదెల టు కి రెడీ అయ్యారు. అయితే హెబ్బా పటేల్ లాగ తమన్నా కూడా డీ గ్లామరస్ రోల్ లో కనపడబోతుందా..? భయపెట్టే అంశాలు ఏమైనా ఉంటాయా అనేది తెలియాలి మరి సినిమా వచ్చేవరకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఆగక తప్పదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here