తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో, అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి దశాబ్ద దాటినా మిల్కీ బ్యూటీగా అన్ని ఇండస్ట్రీలలో దుమ్ము లేపిన ఈమెకు అన్నిచోట్లా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ భామ ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒక్కరిలా రాణిస్తున్నారు.

ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 19 సంవత్సరాలు దాటిపోయింది. పదో తరగతి చదివే సమయంలో ఆమెకు తెలుగులో ఆఫర్ వచ్చింది. దీంతో పాటు పలు యాడ్స్ చేసే అవకాశం కూడా దక్కించుకుంది. ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి రూ.4 నుండి రూ.5కోట్ల పారితోషం తీసుకుంటుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ లో నటిస్తే కోటి రూపాయలకు పైగా పారితోషకం అందుకుంటున్న తమన్నా మొదటిసారి చేసిన యాడ్ కు సుమారుగా లక్ష రూపాయలు తీసుకుందట.

2005లో జరిగిన ఈ యాడ్ కోసం మూడు రోజులు షూట్ చేస్తే లక్ష రూపాయల పారితోషికం అందుకుంది తమన్నా. ఇదే విషయాన్ని ఈ మధ్యే ఓ ఇంటర్వూలో కూడా చెప్పింది తమన్నా. తనకు వచ్చిన ఆ లక్ష రూపాయలను ఫ్యామిలీతోనే ఖర్చు చేసినట్లు చెప్పింది మిల్కీ బ్యూటీ. కాఫీ షాప్‌కు వెళ్లి ఎంజాయ్ చేసానని చెప్పింది ఈ బ్యూటీ. ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో హిట్ కొట్టి.. బద్రీనాథ్‌తో తెలుగులో పాగా వేసింది తమన్నా. సైరా లాంటి భారీ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం బడా హీరోలతో పాటు వెబ్ సిరీస్ లతోనూ అలరిస్తోంది.