యూత్ ఫుల్ మూవీ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి హీరో సిద్దార్థ్. ఈయనకి అప్పట్లో యూత్ లో మరియు లేడీస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు, ఈయన సినిమా విడుదలైతే ఒక స్టార్ హీరో సినిమా విడుదలైనంత హంగామా ఉండేది. ‘బొమ్మరిల్లు’ మరియు ‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలను మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పటికీ కూడా ఖాళీ సమయం దొరికినప్పుడు ఈ సినిమాలను చూడవచ్చు. ఇలాంటి సినిమాలని టైం లెస్ క్లాసిక్స్ అని పిలుస్తారు. అంతే కాదు సిద్దార్థ్ నటించిన ఫ్లాప్ సినిమా ‘ఓయ్’ అనే కూడా యూత్ కి చాలా ఇష్టం. అలాంటి సిద్దార్థ్ కి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన టాలీవుడ్ లోకి ‘టక్కర్’ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు.ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాం.
కథ :
గుణశేఖర్ (సిద్దార్థ్) అనే పేద పిల్లాడు, చిన్న తనం నుండి పేదరికం వల్ల ఎదురుకున్న కష్టాలను చూసి విసిగిలిపోయాడు. ఎలా అయినా జీవితంలో పెద్ద కోటీశ్వరుడు అవ్వాలనే కసితో వైజాగ్ కి వస్తాడు. డబ్బులు సంపాదించాలనే తాపత్రయం తో అడ్డదారులు తొక్కాలని చూస్తాడు. కానీ ఆ అడ్డదారులు తొక్కే ప్రయత్నం లో ఒక సమస్యలో చిక్కుకుంటాడు. అప్పుడు ఆయన ఆ సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు, అతని జీవితం లోకి లక్కీ (దివ్యాంష కౌశిక్) అడుగుపెట్టిన తర్వాత గుణశేఖర్ జీవితం లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?, చివరికి అతను అనుకున్న లక్ష్యానికి చేరుకున్నాడు లేదా అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
హీరో సిద్దార్థ్ వన్ మ్యాన్ షో గా ఈ సినిమా నిల్చింది. ఇంతకు ముందు వరకు ఆయన లవ్ స్టోరీస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు, కానీ ఈ సినిమాతో ఆయన తాను కమర్షియల్ హీరోగా కూడా పనికివస్తాను అని నిరూపించుకున్నాడు. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు మొత్తం తన భుజాలపైన మోశాడు, కొన్ని సన్నివేశాల్లో కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది.
కానీ ఒక విషయం లేని సినిమాకి ఆయన జీవం పోసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. డైరెక్టర్ కార్తీక్ జీ క్రిష్ ప్రారంభం నుండి చివరి వరకు ఆడియన్స్ కి ఎంగేజింగ్ గా ఉండే విధంగా సినిమాని తియ్యడం లో విఫలం అయ్యాడు. ఈ చిత్రం ప్రారంభం చాలా గొప్ప ఉంటుంది, సిద్దార్థ్ క్యారక్టర్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు అనిపించింది.
కానీ సెకండ్ హాఫ్ మాత్రం కథ పూర్తిగా గాడి తప్పింది. ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా చూసేందుకు బాగాలేదు.స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయం లో డైరెక్టర్ సరైన జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే, ఈ చిత్రం సిద్దార్థ్ కి మంచి కం బ్యాక్ సినిమా అయ్యేది. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన దివ్యాంష కౌశిక్ కేవలం అందాలను అరోబోయ్యడానికి మాత్రమే ఈ చిత్రం లో ఉన్నట్టుగా అనిపించింది.
మజిలీ చిత్రం లో అంత అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు ని పొందిన ఈ అమ్మాయి, ఈ సినిమాలో మాత్రం నటనకి ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర పోషించింది. సిద్దార్థ్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయిన ఈ హాట్ బ్యూటీ ని చూసి కుర్రాళ్ళు కాసేపు ఎంజాయ్ చెయ్యొచ్చు.
నటీనటులు : సిద్దార్థ్, దివ్యాంష కౌశిక్ , అభిమన్యు సింగ్ , విగ్నేష్ మరియు యోగిబాబు
దర్శకత్వం : కార్తీక్ జి క్రిష్
మ్యూజిక్ : నివాస్ కె ప్రసన్న
చివరిమాట :
హీరో సిద్దార్థ్ కి మరో చేదు జ్ఞాపకాన్ని మిగిలించిన చిత్రం, ఈ సినిమా సిద్దార్థ్ ని అభిమానించే వారికి యావరేజి అనిపించొచ్చు, కానీ మిగతా ఆడియన్స్ కి మాత్రం తలపోటు సినిమా అనే చెప్పాలి.
రేటింగ్: 1.75 /5