రాత్రి పనులు కవర్ చేయడానికే ఈ మంచిపనులా.. రచ్చ చేస్తున్న కూతురితో కలిసి సురేఖ వాణి..

- Advertisement -

టాలీవుడ్ నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పద్దతిగా సినిమాల్లో హీరోలకు అత్తగా, అమ్మగా కనిపించి మెప్పిస్తుంది. సినిమాలో కనిపించినంత పద్దతిగా మాత్రం బయట కనిపించదు. మొదటి నుంచి సురేఖవాణి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. భర్త చనిపోయాక మరింత యాక్టివ్ గా మారింది. నిత్యం కూతురు సుప్రీత తో కలిసి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ లా తయారయ్యింది. ఇక గతేడాది సుప్రీత బర్త్ డే వేడుకలు ఎంతో పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒక పబ్ లో కూతురు బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది సురేఖావాణి. అప్పుడే కూతురుకు మందు తాగిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఇక దీంతో నెటిజన్స్ ఆమెపై దుమ్మెత్తిపోశారు. కూతురికి నేర్పించే పనులు ఇవేనా అంటూ ఏకిపారేశారు. ఎవరు ఎన్ని అన్నా.. ఎన్ని విమర్శలు చేసినా ఈ తల్లీకూతుళ్లు మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. ఇక తాజాగా సుప్రీత పుట్టినరోజును ఈసారి కూడా గ్రాండ్ గానే సెలెబ్రేట్ చేసింది సురేఖావాణి. కూతురుకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. న్యూయార్క్ వీధుల్లో ఒక డిజిటల్ హోర్డింగ్ లో సుప్రీత తన తండ్రితో ఉన్న ఫోటోను పెట్టించింది.

ఇక అది చూసి సుప్రీత కంటనీరు పెట్టుకుంది. ఆ తరువాత పబ్ లో తల్లి కూతుళ్లు రచ్చచేశారు. పింక్ కలర్ డ్రెస్ లో సుప్రీత అదరగొట్టింది. అలాగే పాటు కాస్తంత మంచి పని కూడా చేసినట్లు సుప్రీత స్టేటస్ చూస్తే అర్ధమవుతుంది. ఓ వృధాశ్రమంలో వాళ్లకి కావాల్సినవి కూడా పంచింది. అయితే ఇది చూసిన వాళ్ళు మాత్రం పగలంతా మంచిపనులు.. రాత్రి అయితే చిందులా అని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

అలాగే ఈ ఫోటోలు, వీడియోలు చూసిన అభిమానులు ఇంత ఖర్చు చేస్తున్నారు.వెకేషన్స్, పబ్ లు, పార్టీలు అంటూ తిరుగుతున్నారు వీరికి డబ్బు ఎక్కడనుంచి వస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది కూతురును తల్లే చెడగొడుతుంది అనిచెప్పుకొస్తున్నారు. ఇక ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో వీరి పేర్లు వినిపించిన సంగతి తెల్సిందే. అయితే వాటికి తమకు ఎలాంటి సంబంధం లేదని సురేఖావాణి చెప్పుకొచ్చింది. మరి ముందు ముందు ఈ తల్లీకూతుళ్లు ఇంకెలాంటి రచ్చ చేస్తారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here