Koratala Shiva : కొరటాల శివ కి సుప్రీం కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో కొరటాల శివ తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న మహేష్ బాబు కి ఈ సినిమా ఇచ్చిన ఉత్సహం మామూలుది కాదు. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అంటిని బద్దలు కొట్టి నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిల్చింది.

అయితే ఈ సినిమా స్టోరీ ని స్వాతి పత్రిక లో వచ్చే మ్యాగజైన్ లోని నా కథని కాపీ కొట్టి తీశారు అంటూ రచయితా శరత్ చంద్ర అప్పట్లో నాంపల్లి హై కోర్టుని ఆశ్రయించాడు. ఆయన ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన నాంపల్లి హై కోర్టు కొరటాల శివ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

నాంపల్లి హై కోర్టు తీర్పుని సవాలు చేస్తూ కొరటాల శివ తెలంగాణ హై కోర్టుని ఆశ్రయించాడు. అక్కడ కూడా అదే తీర్పు రావడం తో కొరటాల శివ నేరుగా సుప్రీం కోర్టు లో పిటీషన్ వేసాడు. దీనిపై సుప్రీం కోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. శ్రీమంతుడు సినిమా విడుదలైన 8 నెలలకు శరత్ చంద్ర ఈ కథ నాదే అంటూ వచ్చాడు. ఈ విషయాన్ని తెలంగాణ , నాంపల్లి హై కోర్టులు పరిగణలోకి తీసుకోలేదని కొరటాల శివ తరుపున న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీం కోర్టు కి చెప్పుకొచ్చాడు.

రచయితా సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం శరత్ చంద్ర వైపు అనుకూలంగా ఉంది కదా, ఇందులో అన్యాయం ఎక్కడ జరిగింది అని సుప్రీం కోర్టు నిలదీసింది అట. పిటీషన్ ని మీరే వెనక్కి తీసుకుంటారా, లేదా మమల్ని కొట్టేయమంటారా అని అనడం తో నిరంజన్ రెడ్డి మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి పిటీషన్ ని వెనక్కి తీసుకున్నాడట. దీంతో కొరటాల శివ త్వరలోనే ఈ కేస్ లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో దేవర అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.