సూపర్​స్టార్ కృష్ణ ఫేవరెట్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా..?

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సాహమేంటో నేర్పిన హీరో. టాలీవుడ్​కు హాలీవుడ్ జేమ్స్ బాండ్​ను తీసుకొచ్చిన కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు వెండితెరపై హేమహేమీలు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా ముందడుగు వేశారాయన. అలానే ఆయన తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్​బాబు కూడా సూపర్​స్టార్​గా ఎదిగి కెరీర్​లో​​ దూసుకెళ్తున్నారు. విశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నారు. మహేశ్​ నటనను చూసి కృష్ణ ఎప్పుడూ మురిసిపోతుంటారు. అయితే మహేశ్​ కాకుండా ఈ తరం హీరోల్లో తనకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు కృష్ణ. మరి కృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో మీరూ చూసేయండి..

 

సూపర్​స్టార్ కృష్ణ
సూపర్​స్టార్ కృష్ణ

ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రభాస్​, ఎన్టీఆర్​, అల్లుఅర్జున్​, రామ్​చరణ్​.. వీరిలో ఎవరంటే ఇష్టమని అడగగా.. జానియర్​ ఎన్టీఆర్​ అని టక్కున చెప్పారు సూపర్​స్టార్​. ఎన్టీఆర్ మంచి నటుడని.. తాతకి తగ్గ మనవడు అంటూ కితాబిచ్చారు. ముఖ్యంగా డైలాగులు చెప్పడంలో తాతకు గట్టి పోటీ ఇస్తాడంటూ పొగిడారు. అలాగే సీనియర్​ ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

అల్లూరి సీతారామరాజు మూవీ సమయంలో తనకు, సీనియర్​ ఎన్టీఆర్​కు మధ్య దాదాపు పదేళ్ల పాటు మాటలు లేవని తెలిపారు. “నేను అల్లూరి సినిమా తీసిన తర్వాత కూడా ఎన్టీఆర్ ఆ చిత్రాన్ని చేయాలని అనుకున్నారు. అందుకోసం పరుచూరి బ్రదర్స్​ను కథ రాయమని అడిగారు. అయితే పరుచూరి బ్రదర్స్​.. కృష్ణ అల్లూరి సినిమా చూశారా అని అడిగారట. అప్పుడు ఎన్టీఆర్​ చూడలేదు అంటే.. ఓ సారి చూడండి అని సలహా ఇచ్చారట. అప్పటికే నాకు ఎన్టీఆర్​కు దాదాపుగా పదేళ్లు మాటల్లేవు. ఒకరోజు అనుకోకుండా స్టూడియోలో ఎదురుపడ్డాం. ‘బ్రదర్ ఇలా రండి’ అని నన్ను పిలిచారు. ఏంటి అని అడిగితే మీ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని చూడాలనుకుంటున్నా. మీరే దగ్గరుండి చూపించాలి అని అడిగారు. వెంటనే ప్రింట్ తెప్పించి పక్కనే కూర్చుని చూపించా. ఇంటర్వెల్​కే అద్భుతంగా ఉందని అన్నారు. ఇక సినిమా మొత్తం అయిపోయాక నన్ను కౌగిలించుకుని ప్రశంసించారు. ఈ సినిమాని ఇంతకంటే బాగా ఎవరూ తీయలేరు అని కితాబిచ్చారు.” అని కృష్ణ గుర్తుచేసుకున్నారు.

 

మరోవైపు కృష్ణకు అలనాటి ఫేవరెట్ హీరోయిన్ అలనాటి తారేనట. తనతో దాదాపు 80కిపైగా హీరోయిన్లు నటించినా.. అందులో కేవలం ఒక్కరు మాత్రమే ఆయనకు ఇష్టమట. ఆ హీరోయిన్​తో కృష్ణ ఏకంగా 30కిపైగా సినిమాలు కూడా చేశారు. ఎంత బిజీగా ఉన్న కథానాయిక ఆమె అంటే టక్కున డేట్స్ ఇచ్చేసేవారట. తన క్యాలెండర్​లో ఆమె కోసం కొన్ని డేట్స్ లాక్ చేసి ఉంచేవారట. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఇంకెవరూ.. అతిలోక సుందరి శ్రీదేవి.

ఈ బుర్రిపాలెం బుల్లోడికి అతిలోక సుందరి అంటే అంత ఇష్టమట. అప్పట్లో మాదిరి ముంబయి నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకునే కల్చర్ అప్పుడు లేకపోవడం వల్ల ఒక హీరోయిన్​తోనే డజను సినిమాల వరకు చేసేవారు. అలా కృష్ణ-శ్రీదేవి కలిసి 30కిపైగా చిత్రాల్లో నటించారు. బుర్రిపాలెం బుల్లోడు, చుట్టాలొస్తున్నారు జాగ్రత్త, కృష్ణార్జునులు, బంగారు కొడుకు, పచ్చని కాపురం ఇలా పలు హిట్ చిత్రాల్లో కృష్ణ-శ్రీదేవి జతకట్టారు. సిల్వర్ స్క్రీన్​పై హిట్ పెయిర్​గా కృష్ణ-శ్రీదేవి పేరు తెచ్చుకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com