నరేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కృష్ణ అభిమానులు.. చంపేస్తామంటూ బెదిరింపులు

- Advertisement -

సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. దాన్నే ఇంగ్లిష్ లో లివ్-ఇన్ రిలేషన్ షిప్ అంటారు. అయితే వీళ్లు కేవలం సహజీవనంలోనే ఉన్నారా? గుంభనంగా పెళ్లి కూడా చేసుకున్నారా? చాలామందికి కలిగిన సందేహం ఇది. ఇప్పుడీ ప్రశ్నకు తనదైన స్టయిల్ లో మళ్లీ పెళ్లి అంటూ సమాధానం ఇచ్చాడు నరేష్. నరేష్ భార్య రమ్య రఘుపతి తో గొడవ.. నరేష్ పవిత్ర హోటల్లో దొరకడం మరింత హాట్ టాపిక్ అయింది. అయితే తమ జీవితాలపై ప్రేక్షకులకు అంత ఇంట్రెస్ట్ ఉండడంతో దీన్ని సినిమాగా తీశారు.

నరేష్

అయితే ట్రైలర్ విడుదలయ్యాక జనాలు విపరీతంగా స్పందిస్తున్నారు. ఇందులో కృష్ణ అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ గొడవలోకి ఆయన్ని ఎందుకు లాగుతున్నారంటున్నారు. సినిమాలో ఆయన పాత్రపై ఎమైనా తేడాగా ఉంటే నరేష్ ను చంపేస్తామని బెదిరింపులు కూడా వస్తున్నట్లు సమాచారం. మీరు చేసుకుంటున్నది ఏదో చేసుకోండి అంతేగాని ఇందులో ఏమాత్రం సంబంధం లేని సూపర్ స్టార్ కృష్ణ గారిని లాగడం ఏ మాత్రం బాలేదని వారు అంటున్నారు. ఈ సినిమాలో తన తల్లి విజయనిర్మల తల్లి వివాహం చేసుకున్న సవతి తండ్రి కృష్ణ పాత్రలు కూడా చూపించబోతున్నారు.

కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు, విజయ నిర్మల పాత్రలో జయసుధ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నరేష్ విజయ కృష్ణ ప్రముఖ నటి పవిత్రా లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. వీరి ప్రేమయాణం పెళ్లి పై పెద్ద రచ్చే జరిగింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల జీవితాల్లో జరిగిన విషయాల పై చూపించినంత ఇట్రెస్ట్ ను వీరి ప్రేమాయణం పై చూపించారు ప్రేక్షకులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here