ఫ్లాప్ అయిన సినిమాలను రీమేక్ చేసి Super hits : కొట్టిన హీరోలు వీళ్ళే!

- Advertisement -

Super hits : ఒక భాషలో సూపర్ హిట్టైన సినిమాని మరో భాషలో రీమేక్ చెయ్యడం ప్రతీ ఇండస్ట్రీ లో జరిగేదే.ఎన్టీఆర్ కాలం నుండి చిరంజీవి కాలం వరకు ఇది కొనసాగుతూనే ఉంది, అలాగే నేటి తరం స్టార్ హీరోలు కూడా రీమేక్ సినిమాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.ఇది ఇలా ఉండగా హిట్టు సినిమాలను రీమేక్ చెయ్యడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు.కానీ ఒక భాషలో అట్టర్ ఫ్లాప్ అయినా సినిమాని రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టడం వెరైటీ.అలా ఫ్లాప్ సినిమాలను రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన హీరోల గురించి ఈరోజు మనం ప్రత్యేకించి మాట్లాడుకోబోతున్నాము.

వీర కన్నడిగా:

Super hits :
Super hits :

సింహాద్రి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘ఆంధ్రవాలా ‘.అప్పట్లో ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు,అలాంటి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.పూరి జగన్నాథ్ కెరీర్ లో మొట్టమొదటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా ఇది.అయితే ఇదే సినిమాని తమిళం లో మెహర్ రమేష్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో ‘వీర కన్నడిగా’ గా రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు.అక్కడ అంత పెద్ద హిట్టైన ఈ సినిమా ఇక్కడ అంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి కారణం అంచనాలే అని అంటారు అభిమానులు.

- Advertisement -

న్యూ :

nani

మహేష్ బాబు – ఎస్ జె సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన నాని చిత్రానికి రీమేక్ ఇది.మహేష్ లాంటి స్టార్ తో ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.ఫలితంగా మహేష్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.కానీ ఇదే సినిమాని ఎస్ జె సూర్య తమిళ్ లో ఆయనే హీరో గా నటించి ‘న్యూ’ అనే పేరు తో విడుదల చేస్తే పెద్ద హిట్ అయ్యింది.ఇందులో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది.

జైహూ :

stalin

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన స్టాలిన్ సినిమాకి రీమేక్ ఇది.స్టాలిన్ పెద్ద ఫ్లాప్ ఏమి కాదు కానీ, యావరేజి అని చెప్పొచ్చు.గజినీ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తీసిన మురగదాస్ , తన తదుపరి చిత్రం గా ఈ సినిమాని తీసాడు.అప్పట్లో కనీవినీ ఎరుగని భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి యావరేజి టాక్ వచ్చింది.కానీ ఇదే సినిమాని హిందీ లో సల్మాన్ ఖాన్ ని హీరో గా పెట్టి తీశారు.కమర్షియల్ గా సక్సెస్ సాధించింది.

కేసి కా భాయ్ కేసి కా జాన్ :

katamarayudu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘కాటమరాయుడు‘ చిత్రానికి రీమేక్ ఇది.’కాటమరాయుడు’ సినిమానే తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వీరం’ చిత్రానికి రీమేక్.తెలుగు లో దీనిని కాటంరాయుడు పేరుతో రీమేక్ చేసారు.కానీ ఆడియన్స్ కి ఈ చిత్రం పూర్తిగా రొటీన్ అని అనిపించడం తో ఫ్లాప్ అయ్యింది.ఇప్పుడు ఈ సినిమాని సల్మాన్ ఖాన్ రీమేక్ చేసాడు.వచ్చే నెల 21 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here