Sukumar : లెక్కల మాస్టర్ సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిస్తే.. షాక్ అవ్వడం గ్యారంటీ

- Advertisement -


Sukumar : లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆర్య, ఆర్య2, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ రీసెంట్‎గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఆయన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు. పుష్ప2తో ఏకంగా గ్లోబల్ స్థాయిని టచ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

pushpa2

సుకుమార్ పుష్ప 2 తరువాత తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 సినిమా తర్వాత తెరకెక్కించాల్సిన సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. అయితే పుష్పకు మించిన పవర్ ఫుల్ లైన్ తో ముందుకు వస్తున్న సుకుమార్ ఈ సినిమాను రియల్ బ్రదర్స్ తో తెరకెక్కిస్తేనే బాగుంటుందంటూ అప్పుడే బ్రదర్స్ రిలేషన్షిప్ జెన్యూన్ గా బయటపడుతుందని డిసైడ్ అయిపోయాడట.

కోలీవుడ్ మెగా బ్రదర్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య, కార్తీక్ లతో సుకుమార్ తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. ప్రజెంట్ ఈ స్క్రిప్ట్ చర్చల్లో ఉన్నాడు సుకుమార్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా ను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడట సుకుమార్. అంతేకాదు సుకుమార్ ఈ సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here