Allu Arjun : అక్షరాలా 96 కథలు.. అల్లు అర్జున్ కోసం సుకుమార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

- Advertisement -

Allu Arjun : మన టాలీవుడ్ లో బెస్ట్ స్క్రిప్ట్ సెలక్షన్ తెలిసిన అతి తక్కువ మంది స్టార్ హీరోలలో ఒకడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తొలిసినిమా ‘గంగోత్రి’ తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ‘ఆర్య’ వంటి చిత్రం చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

Allu Arjun
Allu Arjun

ఈ సినిమా ఆరోజుల్లో 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టడమే కాదు. అల్లు అర్జున్ కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ చిత్రం గా నిల్చింది. మళ్ళీ ఇలాంటి అద్భుతమైన లవ్ స్టోరీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్ లో పడలేదు. ఈ సినిమాని టీవీ లో ఎప్పుడు టెలికాస్ట్ చేసినా కూడా అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తెరకెక్కేముందు చాలా పెద్ద కథే జరిగింది.

అల్లు అర్జున్ కి తన రెండవ సినిమాగా మాస్ సినిమా చెయ్యాలా?, లేదా లవ్ స్టోరీ చెయ్యాలా..? , అనే సందిగ్ధం లో ఉన్నాడు. ఆ సమయం లో ఆయన దాదాపుగా 96 కథలను విన్నాడట. ఒక్క కథ కూడా ఆయనకీ నచ్చలేదు. అప్పుడే దిల్ రాజు తన దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఒకరి దగ్గర మంచి కథ ఉంది, నీకైతే ఈ చిత్రం బాగా సూట్ అవుతుంది, ఒకసారి కథ విను అని అన్నాడట.

- Advertisement -

దిల్ రాజు మాటకి గౌరవం ఇచ్చి అల్లు అర్జున్ ఆ కథని విన్నాడు. విన్న వెంటనే సుకుమార్ ని కౌగలించుకొని ఈ సినిమా మనం చేస్తున్నాం అని అన్నాడట అల్లు అర్జున్. అలా ప్రారంభమైన ఈ సినిమా ఆ తర్వాత ఎలాంటి చరిత్ర సృష్టించిందో మన అందరం చూసాము. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆర్య 2 వచ్చింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా నిల్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here