Guess The Actor : ఈ ఫొటో లో కనిపిస్తున్న బుడ్డోడు బిగ్ బాస్ 6 టాప్ కంటెస్టెంట్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

- Advertisement -

Guess The Actor : ఈ క్రింది ఫోటో లో కనిపిస్తున్న వ్యక్తి బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు కంటెస్టెంట్స్ లో ఒకరు. చూసేందుకు ఎంతో చక్కని పర్సనాలిటీ, ఎప్పుడూ అమ్మాయిల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు అనే పేరు ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే ఆయనకీ పలు సీరియల్స్ లో హీరో గా నటించే అవకాశం దక్కింది. రెండు మూడు సినిమాల్లోనూ నటించాడు.

Guess The Actor
Guess The Actor

బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రారంభం లో కాస్త స్లో గానే ఆడినప్పటికీ , మధ్యలో నుండి చెలరేగిపోయాడు. కానీ అతను చెలరేగిపోయిన సమయం లోనే ఎలిమినేషన్ కి గురి అయ్యాడు. ఇతని ఎలిమినేషన్ చూసే ప్రతీ ఒక్కరికీ ఎంతో బాధని కలిగించింది. అతను మరెవరో కాదు అర్జున్ కళ్యాణ్. మోడల్ గా సీరియల్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఈ షో తర్వాత ఆయనకీ సినిమాల్లో అవకాశాలు ఇప్పటి వరకు పెద్దగా రాలేదు కానీ, బుల్లితెర మీద మాత్రం ఈమధ్య బాగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా బీబీ జోడి డ్యాన్స్ ప్రోగ్రాం లో అర్జున్ కళ్యాణ్ వాసంతి తో కలిసి వేసిన డ్యాన్స్ చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. ఒక ప్రొఫెషినల్ డ్యాన్సర్ డ్యాన్స్ వేస్తె ఎలా ఉంటుందో,అలా అనిపించింది అర్జున్ కళ్యాణ్ డ్యాన్స్ వస్తే. కుర్రాడిలో చాలా టాలెంట్ ఉంది అని అందరూ అనుకున్నారు.

- Advertisement -

బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు కూడా ఇతని మీద ప్రేక్షకుల్లో మంచి ఒపీనియన్ ఉండేది. కానీ వచ్చిన మొదటి రోజు నుండి అతని ద్యాస ఆట మీదకంటే కూడా ఎక్కువగా శ్రీ సత్య మీద ఉండడం వల్లే ఆయన ఆటా మొత్తం చెడిపోయింది అని అర్జున్ కళ్యాణ్ మద్దతు దారులు అనుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అర్జున్ కళ్యాణ్ , ఇంస్టాగ్రామ్ రీల్స్ తో ఇప్పటికీ దుమ్ము లేపుతూనే ఉన్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here