Sudigali Sudheer : అర్థరాత్రి అమ్మాయిలకు సుడిగాలి సుధీర్ వీడియో కాల్స్ వేధింపులు.. చెంప చెళ్లుమనిపించిన స్టార్ హీరో!

- Advertisement -

Sudigali Sudheer : ఈటీవీ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో ద్వారా సుడిగాలి సుధీర్ కి ఇంతమంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ లో ఒక చిన్న ఆర్టిస్టుగా ప్రారంభమైన సుధీర్, ఆ తర్వాత ఈటీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నిటికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యాడు. అయితే మంచి ఫేమ్ రావడం తో సుధీర్ కి సినిమా అవకాశాలు వచ్చాయి. ఒకపక్క కమెడియన్ గా సినిమాలు చేస్త్తూనే , మరోపక్క హీరో గా కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు.

Sudigali Sudheer
Sudigali Sudheer

దీంతో ఆయన బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోస్ కి దూరం అయ్యాడు. కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన బుల్లితెర పై దర్శనం ఇచ్చాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈటీవీ వారు ‘అల్లుడా మజాకా’ అనే స్పెషల్ షో ని ఏర్పాటు చేసారు. ఈ షో కి యాంకర్ గా సుడిగాలి సుధీర్ వ్యవహరించాడు.

Alluda majaka

ఈ షో కి జబర్దస్త్ కమెడియన్స్ మరియు బుల్లితెర నటులతో పాటుగా విక్టరీ వెంకటేష్, మీనా, కుష్బూ వంటి వారు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇదంతా పక్కన పెడితే కొందరు అమ్మాయిలను ఈ షో కి తీసుకొచ్చి సుధీర్ తో కాసేపు మాట్లాడిస్తారు. సుధీర్ ఎలాంటి వాడు అని ఒక అమ్మాయిని అడగగా ‘అతను నా భర్త’ అంటూ సమాధానం చెప్తుంది.

- Advertisement -
Sudigali Sudheer Photos

మరో అమ్మాయిని పిలిచి అడగగా ‘అర్థ రాత్రి సుధీర్ వీడియో కాల్స్ చేస్తూ ఉంటాడు. మా అమ్మ చూస్తాది, ఫోన్ కట్ చెయ్యమని చెప్తే, మీ అమ్మని కూడా వీడియో కాల్ లో చూపించు అని వేధిస్తుంటాడు’ అని చెప్తుంది. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకు సుధీర్ షాక్ అవుతాడు, నేనెప్పుడు నీకు కాల్ చేశాను తల్లీ అంటూ భయంగా అడుగుతాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కానీ ఇదంతా నిజం కాదు , కవలం ఒక స్కిట్ లో భాగం మాత్రమే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here