Sudheer: సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఎంత ఆస్తి ఉందో తెలుసా.??

- Advertisement -

Sudheer: సుడిగాలి సుదీర్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. జబర్దస్త్ షోలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. బుల్లితెర నుంచి వెండి తెర వరకు అడుగులు వేసి హీరోగా నిలదొక్కుకుంటున్నాడు సుధీర్. తాజాగా సోషల్ మీడియాలో సుధీర్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది..

Sudheer
Sudheer

అదేంటి సుధీర్ పెళ్లంటే రష్మి తోనే కదా అని అందరూ పొరపాటు పడతారేమో.. కానే కాదట సుధీర్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓ మంచి సంబంధం కూడా చూశారట. సుధీర్ కి వరసకి మరదలు అవుతుందట. పెద్దలకు తెచ్చిన సంబంధం కావడంతో సుధీర్ కూడా ఒప్పుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. సుధీర్ రష్మీ ప్రేమ గురించి ఒక దశాబ్దం పాటుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మీద స్పెషల్ ఈవెంట్లు పెళ్లి కాన్సెప్ట్ తో ఎన్ని ప్రత్యేకమైన ఈవెంట్స్ వచ్చినా కూడా అవన్నీ హైలెట్ గానే నిలిచాయి. ఇక వీళ్ళిద్దరి అభిమానులు కూడా వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం మేము మంచి స్నేహితులమే అంటూ కొట్టి పారేస్తున్నారు. దాంతో సుధీర్ కి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయ్యారట. సుధీర్ కోసం తన కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన సంబంధం చాలా మంచిదని పైగా వాళ్లు కూడా బాగా ధనవంతులట వరసకి మరదలు అయ్యే ఆ అమ్మాయి వెనుకమాల కొన్ని కోట్లకు పైగా ఆస్తి ఉందని సమాచారం


ఇక అందులో భాగంగా వారి బంధువుల అమ్మాయిని సుధీర్ కి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఫిక్స్ అయ్యారు.సుధీర్ చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే సుధీర్ పెళ్లి పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సుధీర్ పెళ్లి పై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే. గతంలో కూడా పలుమార్లు సుధీర్ వివాహం చుట్టూ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. అవన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here